ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?: కొట్టు సత్యనారాయణ | Ex Minister Kottu Satyanarayana Comments On Chandrababu Over Fee Reimbursement, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?: కొట్టు సత్యనారాయణ

Jan 31 2025 3:17 PM | Updated on Jan 31 2025 4:55 PM

Ex Minister Kottu Satyanarayana Comments On Chandrababu

డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ క్యాంప్‌ కార్యాలయం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన, ట్రెజరీలో సిద్ధంగా ఉన్న డబ్బు విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం జమ చేయలేదు. రేపటి భవిష్యత్తు విద్యార్థులది. వారికి ప్రోత్సహాం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదు. తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను చదివిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ తరపున నిరసన చేపడుతున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ తెలిపారు.

..పవన్‌ కల్యాణ్ ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంకలా అవుతుందని గగ్గోలు పెట్టి.. ఇప్పుడు లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేస్తుంటే నోరుమెదపట్లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాలు ఇస్తామని సినీఫక్కిలో డైలాగులు చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. ఆర్బీకె ల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్ళం. అన్నదాత సుఖీభవ అని 20వేలు ఇస్తామని చెప్పారు దాని ఊసే లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. యువగళంలో లోకేష్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3000 నెలకి ఇస్తానని నమ్మపలికారు.

ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు కొనసాగిస్తామని ప్రక్కన పెట్టేసిన వ్యక్తి చంద్రబాబు. స్వలాభం, స్వార్థం, చేతకానితనంతో విజయవాడను ముంచేశారు. దాతలు ఇచ్చిన సొమ్మును కూడా వందల కోట్లు కాజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి 1 లక్షా 19 వేల కోట్లు ఇప్పటివరకు అప్పులు చేశామని చెబుతున్నారు. దీంతో పాటు మామూలుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకుండా ఇదంతా ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

‘‘సూపర్ సిక్స్‌ పేరుతో ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు అర్థమవుతుంది. పొంతన లేని మాటలు, పొంతన లేని పనులు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. సీజ్ ద షిప్ అంటారు అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని కూడా ఆయనకు తెలియదు. ప్రజలు ప్రస్తుతం ఎంత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఈ ప్రభుత్వానికి తెలుసా?. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్ధమవుతుంది. తాడేపల్లిగూడెంను ఒక పేకాట హబ్ గా మార్చేశారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రజాప్రతినిధులే అందులో పాల్గొనడం దారుణం’’ అని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement