రిపోర్ట్‌ వచ్చి రెండు నెలలైతే ఎందుకు బయటపెట్టలేదు?: అంబటి | Ex Minister Ambati Rambabu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రిపోర్ట్‌ వచ్చి రెండు నెలలైతే ఎందుకు బయటపెట్టలేదు?: అంబటి

Sep 21 2024 4:37 PM | Updated on Sep 21 2024 5:28 PM

Ex Minister Ambati Rambabu Comments On Chandrababu

కక్ష తీర్చుకోవడం కోసం వైఎస్‌ జగన్‌ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

సాక్షి, గుంటూరు: కక్ష తీర్చుకోవడం కోసం వైఎస్‌ జగన్‌ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘బుడమేరు వరద వస్తే జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారు. జగన్‌ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం?.’ అంటూ అంబటి ప్రశ్నించారు.

‘‘తిరుమల లడ్డూ తయారీపై కల్తీ నెయ్యి వాడుతున్నారని ప్రచారం చేశారు. రిపోర్ట్‌ వచ్చి 2  నెలలైతే ఎందుకు బయటపెట్టలేదు?. నెయ్యి ట్యాంకర్లు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యిని రిజక్ట్‌ చేశారు. మొదట వనస్పతి ఆయిల్‌ కలిసిందని టీటీడీ ఈవో ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశాన్ని సమర్థించడానికి ఈవో కష్టపడ్డారు.’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

రిపోర్ట్'వచ్చి రెండు నెలలైతే ఎందుకు బయటపెట్టలేదు? బాబు రియాక్షన్..

ఇదీ చదవండి: డైవర్షన్‌ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే!

‘‘జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు రుజువు చేయలేదు. తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాణం చేయడానికి చంద్రబాబు, లోకేశ్‌కు ధైర్యం ఉందా?. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారు. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆ దేవుడు శిక్ష వేస్తాడు. చంద్రబాబు దుర్మార్గమైన ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదు. వైఎస్సార్‌సీపీ, జగన్‌పై నింద వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement