పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్ | Sakshi
Sakshi News home page

పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్

Published Tue, Nov 7 2023 12:59 PM

Etala, Bandi Sanjay Followers Gets Ticket In Fourth List - Sakshi

హైదరాబాద్:   రాష్ట్రంలో బీజేపీ నాలుగో విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 100 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. నాలుగో విడత జాబితాలో వేములవాడ, హుస్నాబాద్‌లలో పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్ తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. 

వేములవాడలో తుల ఉమాకు టికెట్ అవ్వాలని ఈటల రాజేందర్ పట్టుబట్టారు. చివరకు ఈటల తన అనుచరురాలు తుల ఉమకు టికెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. అటు.. హుస్నాబాద్‌పై బండి సంజయ్ కూడా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. హుస్నాబాద్ టికెట్‌ను బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బండి సంజయ్ బట్టు పట్టి  మరీ ఇప్పించుకున్నారు.

బీజేపీ టిక్కెట్ తుల ఉమకు దక్కడంపై వేములవాడ బీజేపీలో ముసలం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో పనిచేసినవారిని గుర్తించలేదంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలాధ్యక్షులందరూ  మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటు హెచ్చరికలు జారీ చేశారు. మూడురోజుల్లో టిక్కెట్ మార్చకపోతే కచ్చితంగా రాజీనామాలకు సిద్ధమంటున్నారు. ఇక టిక్కెట్ దక్కని చెన్నమనేని వికాస్ రావు.. తాను బండి సంజయ్ నేతృత్వంలో పని చేస్తానంటున్నారు. టిక్కెట్ దక్కకపోయినా అధిష్ఠానం ఏం చెబితే అది చేసేందుకు, ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్టు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 

గంగిడికి మొండి చేయి..
మునుగోడు నియోజక వర్గంలో గంగిడి మనోహర్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం మొండి చేయి చూపించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఆయనకు పార్టీ పెద్దలు ఈ సారి టికెట్ ఇవ్వలేదు.  కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలోకి వచ్చిన చలమల కృష్ణారెడ్డికి టికెట్‌ను ఖరారు చేశారు. 

ఇదీ చదవండి: Telangana: బీజేపీ నాలుగవ జాబితా విడుదల

Advertisement
Advertisement