కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే: డీకే అరుణ | Dk Aruna Sensational Comments On Kcr | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే: డీకే అరుణ

Aug 30 2024 11:16 AM | Updated on Aug 30 2024 7:44 PM

Dk Aruna Sensational Comments On Kcr

కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కూతురు కోసం కేకేను కాంగ్రెస్‌లోకి పంపి రాజీనామా చేయించారు. కవిత కేసు వాదించిన అభిషేక్ సింఘ్వీ కోసమే కేకేతో రాజీనామా చేయించారు. కేశవరావు రాజ్యసభ సీటును అభిషేక్ సింఘ్వీకి ఇవ్వడం వెనక చాలా మతలబు ఉంది’’ అంటూ డీకే అరుణ చెపుకొచ్చారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. హైడ్రా వెనక హైడ్రామా నడుస్తోంది. పేదల దగ్గరకు రావొద్దు. పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం. చెరువుల పరిరక్షణ చేయాలి.. కానీ పేదల ఇండ్లను కూల్చవద్దు.. ఇదే బీజేపీ లైన్ ఇదే. ఆరు గ్యారంటీలను మరిపించడానికే హైడ్రా కూల్చివేతలు. అదిగో పెద్దోళ్ల ఇళ్ల కూల్చడం.. అది చూసి పేదలు సంతోష పడాలని అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు’’ ఉందని అరుణ వ్యాఖ్యానించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement