మొన్నటి కాంగ్రెస్‌ కమిటీల్లో నా పేరు లేదు అంటే..: విజయశాంతి | Congress MLC Vijayashanti Responds Over Congress Committees, More Details Inside | Sakshi
Sakshi News home page

మొన్నటి కాంగ్రెస్‌ కమిటీల్లో నా పేరు లేదు అంటే..: విజయశాంతి

Jun 1 2025 4:09 PM | Updated on Jun 1 2025 5:35 PM

Congress MLC Vijayashanti Responds Over Congress Committees

విజయశాంతి(ఫైల్‌ఫోటో)

హైదరాబాద్: ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనబడుతోంది. తాము సీనియర్లమైనా తమకు ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదని లోలోన మదనపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటివరకూ దీనిపై నేరుగా ఏ కాంగ్రెస్‌ నేత నేరుగా విమ  ర్శలు చేయకపోయినా  ఈ కమిటీల్లో తమను ఎంపిక చేసి ఉండి ఉంటే బాగుంటుందనేది వారి అభిప్రాయంగా ఉంది.  కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు అంశం తర్వాత  కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి  కూడా తనకు ఈ కమి టీల్లో ఏ పదవి  ఇచ్చినా ఓకే అంటూ స్ప ష్టం చేశారు. 

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి మీడియాతో చిట్ చాట్ లో.. ‘సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానికి తెలుసు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదు అంటే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ విజయశాంతి కూడా కమిటీలో తనను ఎంపిక చేసే ఉంటే బాగుండేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, అడ్వైజరీ కమిటీలతో పాటు డీలిమిటేషన్‌,  పీసీసీ క్రమశిఓణ కమిటీలకు  ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

22 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ,  అడ్వైజరి కమిటీలో 15 మందికి చోటు కల్పించారు. 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడు మంది సభ్యులను నియమించారు. ఇలా పలు కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.

పీఏసీ(పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ)లో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు,  ఇక అడ్వైజరీ కమిటీలో రేవంత్‌, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండనున్నారు. డీలిమిటేషన్‌ కమిటీ చైర్మన్‌ గా వంశీచందర్‌ రెడ్డి నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ చైర్మన్‌గా పి. వినయ్‌ కుమార్‌లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement