తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్‌ | Cm Kcr Speech At Kamareddy Road Show | Sakshi
Sakshi News home page

అసమర్థులు తెలంగాణను ఏలుతున్నారు: కేసీఆర్‌

May 7 2024 9:10 PM | Updated on May 7 2024 9:12 PM

Cm Kcr Speech At Kamareddy Road Show

సాక్షి,కామారెడ్డి: సీఎం రేవంత్ కామారెడ్డి జిల్లాను తీసేయాలని చూస్తున్నాడని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే జహీరాబాద్‌ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌ గెలవాలని బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం(మే7) కామారెడ్డి జేపీఎన్‌  చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు. 

’తెలంగాణకు మోది చేసింది ఏమీ లేదు. బీజేపీ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నేరేవేర్చే స్దితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలొ ఎక్కడా చూసినా కరెంట్ కోతలు. వరి బోనస్ ...బోగస్‌గా మారింది.

అసమర్దులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలలకే రాష్ట్రం ఆగమైపోయింది. బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటిని రద్దు చేశారు. కేంద్రంలో  రాబోయేది  సంకీర్ణ ప్రభుత్వమే’నని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement