మా స్థానాలు, అభ్యర్థుల మార్పులుండవు  | Clarification of BJP state election co incharge Siddharth Nath Singh on alliance | Sakshi
Sakshi News home page

మా స్థానాలు, అభ్యర్థుల మార్పులుండవు 

Apr 10 2024 5:38 AM | Updated on Apr 10 2024 5:38 AM

Clarification of BJP state election co incharge Siddharth Nath Singh on alliance - Sakshi

బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ఆయా స్థానాలకు ఇప్పటికే పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న సిద్ధార్థనాథ్‌ సింగ్‌ అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీట్లు మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన నరసాపురం లోక్‌సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా  తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్‌ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిపై సిద్ధార్థనాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement