కాంగ్రెస్‌, బీజేపీ మధ్య క్విడ్‌ ప్రో కో: కేటీఆర్‌ | BRS Working President KTR Tweet On ED Raids On Ponguleti Srinivas Reddy, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య క్విడ్‌ ప్రో కో: కేటీఆర్‌

Oct 29 2024 9:05 AM | Updated on Oct 29 2024 11:40 AM

Brs Working President Ktr Tweet On Ed Raids On Ponguleti Srinivasreddy

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌, బీజేపీ మధ్య క్విడ్‌ ప్రో కో ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ  మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా మంగళవారం(అక్టోబర్‌ 29) కేటీఆర్‌ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. 

‘తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోంది. కాంగ్రెస్,బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ,కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదు.

దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారు. ఇది బీజేపీ,కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రో కో కాక మరేంటి?’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీజేపీ మధ్య "క్విడ్ ప్రో కో".. కేటీఆర్ సంచలన ట్వీట్ ..

ఇదీ చదవండి: సీడీఎంఏగా శ్రీదేవి..హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement