న్యాయ్‌ కాదు.. కాంగ్రెస్‌ది నయ వంచన: కేటీఆర్‌  | BRS KTR Satirical Comments Over Congress Party | Sakshi
Sakshi News home page

న్యాయ్‌ కాదు.. కాంగ్రెస్‌ది నయ వంచన: కేటీఆర్‌ 

Apr 7 2024 9:44 AM | Updated on Apr 7 2024 1:01 PM

BRS KTR Satirical Comments Over Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా న్యాయ్‌ పేరిట నయా నాటకానికి కాంగ్రెస్‌ నాయకులు తెరతీశారని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌. రాహుల్‌ గాంధీ.. తెలంగాణ అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.

నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ నయ వంచన చేసిందని మండిపడ్డారు. కాగా, నిన్న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ సభపై కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కేటీఆర్‌ ట్విట్టర్‌లో..

‘అది జనజాతర సభ కాదు... 
హామీల పాతర... అబద్ధాల జాతర సభ..

రాహుల్ గాంధీ గారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 
6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..!

పార్లమెంట్ ఎలక్షన్లలో.. 
న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..?

తెలంగాణకు తీరని అన్యాయం చేసి..
ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??

నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను 
నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ 

అసత్యాలతో అధికారంలోకి వచ్చి..
అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది..
నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది.. 
గ్యారెంటీలకు పాతరేసి... అసత్యాలతో జాతర చేస్తోంది..

తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా..
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు.. 
అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు.. 

కాంగ్రెస్ అసమర్థ పాలనలో...
సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు.
రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.
తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు.
మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు..

రాహుల్ గారు.. 
మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..?
లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ?
200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ?
చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ?
డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ? 

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. 
దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. 
ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే.. కాంగ్రెస్ 
కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు

చేతి గుర్తుకు ఓటేస్తే.. 
చేతులెత్తేయడం ఖాయమని.. 
తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.

సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన..
భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే.. 
నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. 

అందుకే..
వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం.’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement