కూల్చే పనిలో కాంగ్రెస్‌.. అమ్మే పనిలో బీజేపీ: కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On Congress And BJP | Sakshi
Sakshi News home page

కూల్చే పనిలో కాంగ్రెస్‌.. అమ్మే పనిలో బీజేపీ: కేటీఆర్‌

Mar 21 2025 9:28 AM | Updated on Mar 21 2025 11:44 AM

BRS KTR Satirical Comments On Congress And BJP

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేశారు. కొత్త పరిశ్రమలు పెట్టరు.. ఉన్న పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు
ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.

బీజేపీ నుండి
ఎనిమిది మంది ఎంపీలు
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు 
ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.

కాంగ్రెస్ నుండి 
ఎనిమిది మంది ఎంపీలు, 
64 మంది ఎమ్మెల్యేలు 
ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.

కొత్త పరిశ్రమలు కావాలని అడగరు ... 
ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు.

కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ... 
తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం.

మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదు
ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యం

తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు 
ఈ పార్టీలకు పట్టవు.
జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement