‘చంద్రబాబు ఇప్పటికే రాజకీయ సమాధి అయ్యారు’ | Botsa Satyanarayana Criticizes Chandrababu In West Godavari | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఇప్పటికే రాజకీయ సమాధి అయ్యారు’

Jan 4 2021 1:57 PM | Updated on Jan 4 2021 2:03 PM

Botsa Satyanarayana Criticizes Chandrababu In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అని చెప్పి టిడ్‌కో గృహాల ద్వారా అడుగుకి ధర పెట్టీ పేద ప్రజల డబ్బులను స్వాహా చేశారన్నారు. ఆరు నెలల్లో సగం పూర్తయిన టిడ్‌కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సోమవారం మం‍త్రి జిల్లాలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలు విని అధికారంలోకి వచ్చాక నవరత్నాలు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చదవండి: దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర

అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేశామన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్‌ను చంద్ర బాబు, లోకేష్ బురద చల్లడం సిగ్గు చేటన్నారు.. తండ్రికి తగ్గ తనయుడులా సీఎం జగన్ అభివృద్ది పథంలో దూసుకుపోతున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఇప్పటికే రాజకీయంగా సమాధి అయ్యారని, చంద్రబాబు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement