Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర

BJP Vijaya Sankalpa Yatra Starts Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. రేపట్నుంచి(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర గురించి వివరాలు వెల్లడించారు.

‘రేపటి నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కానుంది. రేపు నాలుగు యాత్రలు ప్రారంభం కానున్నాయి .కోమరంభీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రం ప్రారంభం అవుతుంది. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్ర కరీం నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనుంది. ఇందులో 22 అసెంబ్లీలు కవర్ చేయనుంది. మిగిలిన నియోజక వర్గాలను సైతం కవర్ చేసేందుకు కృషి చేస్తాం. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుంది. భువనగిరి , మల్కాజ్‌గిరి  హైదరాబాద్ , సికింద్రాబాద్ కవర్ చేస్తూ.. యాత్ర కొనసాగనుంది

కృష్ణ విజయ సంకల్ప యాత్ర మక్తల్ లో కృష్ణ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కవర్ చేస్తూయాత్ర కొనసాగనుంది. కొమరం భీం యాత్రనుఅస్సాం సీఎం  హేమంత్ బిస్వా శర్మ ప్రారంభిస్తారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూర్‌లో ప్రారంభం కానుంది. దీనికి కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ హాజరుకానున్నారు. భాగ్యలక్ష్మీ యాత్రకి గోవా సీఎం ప్రమోద సావంత్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కృష్ణ యాత్రకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరవుతారు. యాత్రలో రోడ్ షో లు ఎక్కువ ఉంటాయి. ఐదు యాత్రలు కలిపి 5500 కి.మీలు కవర్‌ కానుంది. 114 అసెంబ్లీ కవర్ అయ్యేలా కవర్ యాత్ర ఉండనుంది. 106 రోడ్ షో లు ఉండనున్నాయి’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top