breaking news
BJP Vijaya Sankalpa Yatra
-
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. రేపట్నుంచి(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర గురించి వివరాలు వెల్లడించారు. ‘రేపటి నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కానుంది. రేపు నాలుగు యాత్రలు ప్రారంభం కానున్నాయి .కోమరంభీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రం ప్రారంభం అవుతుంది. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్ర కరీం నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనుంది. ఇందులో 22 అసెంబ్లీలు కవర్ చేయనుంది. మిగిలిన నియోజక వర్గాలను సైతం కవర్ చేసేందుకు కృషి చేస్తాం. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుంది. భువనగిరి , మల్కాజ్గిరి హైదరాబాద్ , సికింద్రాబాద్ కవర్ చేస్తూ.. యాత్ర కొనసాగనుంది కృష్ణ విజయ సంకల్ప యాత్ర మక్తల్ లో కృష్ణ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కవర్ చేస్తూయాత్ర కొనసాగనుంది. కొమరం భీం యాత్రనుఅస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభిస్తారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూర్‌లో ప్రారంభం కానుంది. దీనికి కేంద్రమంత్రి బీఎల్ వర్మ హాజరుకానున్నారు. భాగ్యలక్ష్మీ యాత్రకి గోవా సీఎం ప్రమోద సావంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కృష్ణ యాత్రకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరవుతారు. యాత్రలో రోడ్ షో లు ఎక్కువ ఉంటాయి. ఐదు యాత్రలు కలిపి 5500 కి.మీలు కవర్ కానుంది. 114 అసెంబ్లీ కవర్ అయ్యేలా కవర్ యాత్ర ఉండనుంది. 106 రోడ్ షో లు ఉండనున్నాయి’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.