కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు: కిషన్‌రెడ్డి

BJP Kishan Reddy Slams On Congress And BRS At Devarkadra - Sakshi

సాక్షి, మహబూబునగర్: కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.

‘ఏప్రిల్  నెలలలో పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ముందు ప్రపంచ దేశాల అధ్యక్షులు చేతులు కట్టుకొని నిలబడే స్థాయికి వచ్చాము. తొమ్మిదిన్నర సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ. మరీ కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. దేశం అంటే అంకితభావంతో పనిచేసే వ్యక్తి మోదీ. 5 వందల సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి గుడి కూల్చి మసీదు కట్టాడు. కానీ నేడు టెంటులో ఉన్న రాముడికి భవ్య మైన మందిరం నిర్మించాడు మోదీ సంకల్పం అదే.

... దేశంలో ఎక్కడ కూడా ఈపాలనలో అల్లర్లు జరిగిన చరిత్ర లేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాదులను చంపిన చరిత్ర మోడీది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీది. ధర్మం వైపు ఉన్న మోదీ కావాలా అధర్మం వైపు ఉన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో అయిన మోదీ చరిష్మా కనిపిస్తుంది.

... దేవరకద్రలో  రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి హామీ ఇస్తున్నా. దేశం లో ప్రజలందరూ మోదీ వైపు ఉన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను కమలంకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యం. రాష్ట్రంలో రాహుల్ టాక్స్ వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసి ఎన్నికలలో ఖర్చు పెట్టాలని దోపిడీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది వారు బీజేపీ వైపు నిలబెడుతారనే నమ్మకం ఉంది’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top