Delhi: హైకమాండ్‌ నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు | Bjp High Command Calls To Kishan Reddy To Delhi | Sakshi
Sakshi News home page

Delhi: హైకమాండ్‌ నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు

Mar 9 2024 3:03 PM | Updated on Mar 9 2024 3:23 PM

Bjp High Command Calls To Kishan Reddy To Delhi - Sakshi

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

మిగిలిన 8 మంది అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. జాయినింగ్ అనేది నిరంతర ప్రక్రియ.. చాలా మంది చేరుతున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్తున్నానని.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను  కలిసి, రాజకీయ అంశాలు, అభ్యర్థులపై చర్చిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement