బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు.. తెలంగాణపై నడ్డా కీలక వ్యాఖ్యలు | Bjp Chief Nadda Comments On Telangana In National Meeting | Sakshi
Sakshi News home page

బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు.. తెలంగాణపై నడ్డా కీలక వ్యాఖ్యలు

Feb 17 2024 6:29 PM | Updated on Feb 17 2024 7:00 PM

Bjp Chief Nadda Comments On Telangana In National Meeting - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపినడ్డా తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌ భారత్‌ మండపంలో బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణలో గతంలో 7 శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందని చెప్పారు. ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఐదేళ్లలో బలం పెంచుకుని తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారిఅధికారంలోకి రానున్నట్లు చెప్పారు.  ఈ సందర్భంగా గత పదేళ్లలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధులకు నడ్డా వివరించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి.. ఇండియా కూటమి కథ ముగిసింది.. నితీశ్‌ కుమార్‌ 

Advertisement
 
Advertisement
Advertisement