టార్గెట్‌ లోక్‌సభ.. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన! | BJP To Announce Candidates For Lok Sabha Polls In Central Election Committee Meeting In Delhi - Sakshi
Sakshi News home page

BJP Lok Sabha Candidates Announcement: టార్గెట్‌ లోక్‌సభ.. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన!

Published Thu, Feb 29 2024 9:02 AM

BJP To Announce Candidates For Lok Sabha Elections - Sakshi

సాక్షి, ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

కాగా, నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనుంది. దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో, ఆశాహహుల్లో కొంత టెన్షన్‌ నెలకొంది. 

ఇక, తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నాగర్‌ కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్‌ బీజేపీలో చేరుతున్నారు. దీంతో, బీజేపీ ఆయనకు నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. 

రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కివచ్చిందని బీజేపీ నేతల టాక్.  నలుగురు సిట్టింగ్‌లు, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరెడ్డి వంటి వారి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది, ఇక మిగిలిన స్థానాల్లో ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. హస్తిన వెళ్లి ఎవరి లాబీయింగ్ వాళ్లు చేస్తున్నారు. ఓ వైపు విజయ సంకల్పయాత్రంలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్న కాషాయదళం..

టికెట్ల కేటాయింపునకు ఏ ప్రామాణికత ఆధారంగా ఇస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిత్వాలపై పలువురు నేతలు ధీమాగా ఉన్నారు, మల్కాజిగిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటల రాజేందర్, చేవేళ్ల నుంచి కొండా, మెదక్ నుంచి రఘునందన్, ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే ఛాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు అలాగే బిఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement