పచ్చ ముఠా ఢమాల్‌ ! | Big Shock to Chandrababu with YSRCP Siddam Sabha | Sakshi
Sakshi News home page

పచ్చ ముఠా ఢమాల్‌ !

Feb 20 2024 2:56 AM | Updated on Feb 20 2024 6:06 AM

Big Shock to Chandrababu with YSRCP Siddam Sabha - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ ఎన్నికల సన్నాహక సభలు అంచనాలకు మించి విజయవంతం అవుతుండడంతో చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. రాయలసీమ జిల్లాలన్నింటికీ కలిపి రాప్తాడులో ఆదివారం జరిగిన సభకు జనం పోటెత్తిన తీరు చంద్రబాబుని కలవరానికి గురి చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆయన వెంటనే తనకు అలవాటైన డైవర్షన్‌ రాజకీయాన్ని అందుకున్నారు. రాప్తాడు జన సునామీ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక దాన్ని పక్కదారి పట్టించేందుకు సవాళ్లకి తెర దీశారు.

దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా ? అని సవాల్‌ విసరడం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమేనని స్పష్టమవుతోంది. ఏ అంశం మీదైనా, ఎక్కడైనా, ఏ రోజైనా తాను సీఎంతో చర్చకు సిద్ధమని ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించలేక అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారు. తన సతీమణిని ఎవరూ ఏమీ అనకుండానే తిట్టారనే సాకు చూపించి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి విలపించారు. నిజంగా అంత ధైర్యం ఉన్న నేత అయితే అసెంబ్లీ నుంచి పారిపోవడం, బయటకు వచ్చి ఏడవడం వంటి పనులు చేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

‘సిద్ధం’ సక్సెస్‌.. ‘రా కదలిరా’ అట్టర్‌ ఫ్లాప్‌..  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సభలు ఊహించని విధంగా భారీ జన సందోహాలతో ఔరా అనిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ సభలు మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయి. 18కిపైగా సభలు పెట్టిన చంద్రబాబు ఒక్కదానితో కూడా సంతృప్తి చెందలేకపోయారు. జనం నుంచి స్పందన లేక ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పుకుపోతున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ ‘శంఖారావం’ సభలతో మరీ తేలిపోతున్నాయి. చినబాబు ‘శంఖారావం’ తమ నెత్తిన గుదిబండగా మారిందని అది జరుగుతున్న ప్రాంతంలోని నేతలు వాపోతున్నారు.

తమ సభలు విఫలమవుతూ అధి­కార పార్టీ నిర్వహిస్తున్న సభలు విజయవంతమవుతుండడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వణుకు పుట్టిస్తోంది. మొట్టమొదట భీమిలిలో నిర్వహించిన ‘సిద్ధం’ సభ కేక పుట్టించగా,   దెందులూరులో జరి­గిన సభ అంతకు మించి అనేలా జరిగింది. ఆది­వా­రం రాప్తాడు సభ అయితే చూడ్డానికి కళ్లు సరిపోలేదు. దీంతో చంద్రబాబులోని అక్కసు కట్టలు తెంచుకుంది.  ఆ సభలను డైవర్ట్‌ చేసేందుకు ఎత్తుగడగా సీఎంతో చర్చకు సవాల్‌ విసిరారు. దానికి ఎల్లో మీడియా వంత పాడుతోంది.  అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు సీఎంతో బహిరంగ చర్చకు సవాల్‌ విసరడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement