breaking news
siddamma
-
పచ్చ ముఠా ఢమాల్ !
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ ఎన్నికల సన్నాహక సభలు అంచనాలకు మించి విజయవంతం అవుతుండడంతో చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. రాయలసీమ జిల్లాలన్నింటికీ కలిపి రాప్తాడులో ఆదివారం జరిగిన సభకు జనం పోటెత్తిన తీరు చంద్రబాబుని కలవరానికి గురి చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆయన వెంటనే తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాన్ని అందుకున్నారు. రాప్తాడు జన సునామీ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక దాన్ని పక్కదారి పట్టించేందుకు సవాళ్లకి తెర దీశారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసరడం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని స్పష్టమవుతోంది. ఏ అంశం మీదైనా, ఎక్కడైనా, ఏ రోజైనా తాను సీఎంతో చర్చకు సిద్ధమని ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి సీఎం వైఎస్ జగన్‌తో చర్చించలేక అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారు. తన సతీమణిని ఎవరూ ఏమీ అనకుండానే తిట్టారనే సాకు చూపించి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి విలపించారు. నిజంగా అంత ధైర్యం ఉన్న నేత అయితే అసెంబ్లీ నుంచి పారిపోవడం, బయటకు వచ్చి ఏడవడం వంటి పనులు చేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘సిద్ధం’ సక్సెస్.. ‘రా కదలిరా’ అట్టర్ ఫ్లాప్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సభలు ఊహించని విధంగా భారీ జన సందోహాలతో ఔరా అనిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ సభలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. 18కిపైగా సభలు పెట్టిన చంద్రబాబు ఒక్కదానితో కూడా సంతృప్తి చెందలేకపోయారు. జనం నుంచి స్పందన లేక ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పుకుపోతున్నారు. ఆయన కుమారుడు లోకేశ్ ‘శంఖారావం’ సభలతో మరీ తేలిపోతున్నాయి. చినబాబు ‘శంఖారావం’ తమ నెత్తిన గుదిబండగా మారిందని అది జరుగుతున్న ప్రాంతంలోని నేతలు వాపోతున్నారు. తమ సభలు విఫలమవుతూ అధికార పార్టీ నిర్వహిస్తున్న సభలు విజయవంతమవుతుండడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వణుకు పుట్టిస్తోంది. మొట్టమొదట భీమిలిలో నిర్వహించిన ‘సిద్ధం’ సభ కేక పుట్టించగా, దెందులూరులో జరిగిన సభ అంతకు మించి అనేలా జరిగింది. ఆదివారం రాప్తాడు సభ అయితే చూడ్డానికి కళ్లు సరిపోలేదు. దీంతో చంద్రబాబులోని అక్కసు కట్టలు తెంచుకుంది. ఆ సభలను డైవర్ట్ చేసేందుకు ఎత్తుగడగా సీఎంతో చర్చకు సవాల్ విసిరారు. దానికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు సీఎంతో బహిరంగ చర్చకు సవాల్ విసరడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మహిళపై ప్రత్యర్థులు దాడి
హుజూర్నగర్: భూవివాదం నేపథ్యంలో ఓ మహిళపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూరగడ్డ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సైదమ్మ (35) అనే మహిళకు పొలం సరిహద్దుల విషయంలో కొందరితో గత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పొలం దగ్గర ఉన్న ఆమెపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేసి... గొంతు కోశారు. ఆమె హుజూర్నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి...ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బి.కొత్తకోట మండలం కమ్మాలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సిద్ధమ్మ(30), రవి(38) భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సిద్ధమ్మ(30) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగింది. హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సిద్ధమ్మ మధ్యాహ్నాం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


