భూవివాదం నేపథ్యంలో ఓ మహిళపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేశారు.
హుజూర్‌నగర్: భూవివాదం నేపథ్యంలో ఓ మహిళపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరగడ్డ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సైదమ్మ (35) అనే మహిళకు పొలం సరిహద్దుల విషయంలో కొందరితో గత కాలంగా విభేదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం పొలం దగ్గర ఉన్న ఆమెపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేసి... గొంతు కోశారు. ఆమె హుజూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి...ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


