ఆ వార్తల్లో వాస్తవం లేదు: బండి సంజయ్‌ | Bandi Sanjays Chai Pe Charcha with RMP Doctors | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో వాస్తవం లేదు: బండి సంజయ్‌

Jun 16 2026 1:15 PM | Updated on Jun 16 2026 1:47 PM

Bandi Sanjays Chai Pe Charcha with RMP Doctors

కరీంనగర్‌:  హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్లమైతే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు ఎందుకిస్తామని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బండి సంజయ్‌.

కరీంనగర్ జిల్లా మాన కొండూరులో ఆర్ఎంపీ డాక్టర్లతో ‘ఛాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు బండి సంజయ్‌. బీఆర్ఎస్‌లో మావోయిస్టు భావజాల నేతలున్నది నిజమేనని. అలాంటి వారితోనే సమాజానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. మావోయిస్టులే ఆ భావజాలాన్ని వీడి లొంగిపోయారని, వీడకపోతే వారి భవిష్యత్‌కే నష్టమన్నారు బండి సంజయ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement