సోనియా గాంధీని కలిసిన అశోక్‌ చవాన్‌?.. స్పందించిన మాజీ సీఎం | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీని కలిసిన అశోక్‌ చవాన్‌?.. స్పందించిన మాజీ సీఎం

Published Mon, Mar 18 2024 3:39 PM

Ashok Chavan Reacts Rahul Gandhi Weeping Senior Leader Who Quit comments - Sakshi

ముంబై: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీని తాను అసలు కలవనేలేదని ఇటీవల బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ అన్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఒకవేళ రాహుల్‌ గాంధీ నా గురించే మాట్లాడి ఉంటే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆధారంలేని అసత్యాలు. నేను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయటం నిజం. నేను ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశా. అయితే నేను రాజీనామా చేశానని కొంతమందికి తెలియదు’ అని అశోక్‌ చవాన్‌ అన్నారు.

‘నేను కాంగ్రెస్‌ నాయకులురాలు సోనియా గాంధీని అసలు కలవలేదు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరూపితం కాని అసత్యాల. నేను సోనియా గాంధీ  వద్ద ఎటువంటి భావాలు వ్యక్తం చేయలేదు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల సందర్భంగా చేసే రాజకీయ స్టేట్‌మెంట్లు మాత్రమే’ అని అశోక్‌ చవాన్‌ స్పష్టం చేశారు. 

అయితే నిన్న(ఆదివారం) రాహుల్‌గాంధీ తాను చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా పేరు ప్రస్తావించకుండా  కాంగ్రెస్‌ పార్టీ వీడిన ఓ సీనియర్‌ నేత తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి పార్టీ వీడే పరిస్థతి వచ్చినందుకు కన్నీటిపర్యంతమయ్యారని అన్నారు. అయితే ఆయన పరోక్షంగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించటం గమనార్హం.

‘తాను కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చాలా సిగ్గుపడుతున్నా. వారితో పోరాడటానికి నాకు శక్తి లేదు. నాకు జైలుకు వెళ్లటం ఇష్టం లేదు. అందుకే పార్టీ మారుతున్నాని నా తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి సదరు సీనియర్‌ నేత కన్నిటీపర్యంతమయ్యారు’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఇక.. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉ‍న్న అశోక్‌ చవాన్‌ గత నెలలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement