ఏపీలో రెడ్‌బుక్ పాలనలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యంపై దారుణ మారణకాండ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పక్కా పథకం ప్రకారం ఏడు దశల్లో ముప్పేట దాడి జరుగుతోంది. దశల వారీగా ఏమార్చి.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పాపంలో అధికారపక్షం, పోలీస్, ఎస్‌ఈసీ భాగస్వాములు కావడం దిగ్భ్రాంతి పరుస్తోంది.
వైఎస్సార్ జిల్లా:
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లలో కొనసాగుతున్న అదే ఉద్రిక్తత
- రెండు రోజుల పాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వని టీడీపీ మూకలు
- అడుగడుగునా అడ్డుకుని పత్రాలు చించివేసిన వైనం
- రెండు రోజులు పోరాటం చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కేవలం 2 జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే నామినేషన్
- మరో వైపు ఫేక్ నామినేషన్లకు తెరలేపిన టీడీపీ
- వైఎస్సార్సీపీ 2 స్థానాలకు మాత్రమే నామినేషన్ వేయగలిగితే 19 నామినేషన్లు పడ్డట్లు చూపుతున్న ఎన్నికల అధికారుల నివేదికలు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థులమంటూ నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ
- రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
- మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్లను సైతం అడ్డుకుంటున్న వైనం
- జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా మారని తీరు
- నిన్న ఒక్కరోజే మూడు సార్లు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
- కేవలం ఎర్రగుంట్ల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే నామినేషన్
- మూడో రోజూ జిల్లా పరిషత్ వద్ద నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు
- రక్షణ కల్పించి తమను నామినేషన్ వేయించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థుల వేడుకోలు
పల్నాడు జిల్లా:
- మాచర్లలో మూడో రోజు కూడా కొనసాగుతున్న పోలీసుల నిర్బంధం
- పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ గృహనిర్బంధం
- నామినేషన్ల చివరి రోజు కూడా పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకాలు
- నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు పూర్తి అయినా..
- మాచర్ల నియోజకవర్గంలో నేటికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా అడ్డగించిన టీడీపీ మూకలు
- పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడులు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల రక్తం కళ్లచూస్తున్నా కనీసం పట్టించుకోని వైనం
- మరో వైపు వైఎస్సార్‌సీపీ నేతలను మాత్రం అక్రమంగా గృహనిర్బంధం చేస్తోన్న పోలీసులు
వైఎస్సార్ జిల్లా:
కడపలో కొనసాగుతున్న పోలీసుల దౌర్జన్యం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఆంక్షలు
పులివెందులలో ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం
పులివెందుల పట్టణంలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు
పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని వెల్లడి
నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు గుమిగూడినా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిక
గతంలో అక్టోబర్ 17న కూడా ఆంక్షలు ఉల్లంఘించినట్లు నోటీసులో ప్రస్తావన
మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంపీపై చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పేరిట నోటీసు జారీ
ఊరూరా రగులుతున్న రావణ కాష్టం
నామినేషన్లు వేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుకున్న పచ్చమూక
సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు..
ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధాలు.. బెదిరింపులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను యథేచ్ఛగా అడ్డుకున్న అధికారపక్షం
నామినేషన్లకు అడ్డంకులు.. పత్రాల చించివేత
మహిళలపైనా దాడులు.. చీరలు లాగివేత.. గాజులు పగులగొట్టి దాష్టీకం
పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుతో దొంగ నామినేషన్లు
సర్కారు నిర్వాకంతో ఊరూరా రగులుతున్న రావణ కాష్టం


