45మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగు చోట్లే మళ్లీ నామినేషన్లు | YSRCP Gets Fresh Nomination Chance in Only Four Places: Andhra pradesh | Sakshi
Sakshi News home page

45మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగు చోట్లే మళ్లీ నామినేషన్లు

Oct 23 2026 6:07 AM | Updated on Oct 23 2026 6:07 AM

YSRCP Gets Fresh Nomination Chance in Only Four Places: Andhra pradesh

వాటిలోనూ 72 వార్డులకే కొత్తగా నామినేషన్ల స్వీకరణ  

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటన 

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూలులో మార్పులు 

వచ్చే నెల 1న పోలింగ్‌.. 3న ఓట్ల లెక్కింపు 

ఎన్నిక వాయిదా వేసిన మైదుకూరుకు సైతం అదే రోజు ఎన్నిక  

తిరుపతిలో 18, కడపలో 11, రాజంపేటలో 11, మైదుకూరులో మొత్తం 32 వార్డులకు కొత్తగా నామినేషన్లు స్వీకరణ  

నేటి ఉదయం 11 నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు 

25న వీటి పరిశీలన.. మధ్యాహ్నం 3గంటలలోగా ఉపసంహరణకు అవకాశం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ వినతి మేర­కు మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగిన 19 చోట్ల తిరిగి నామినేషన్లు స్వీకరించే విష­యం పరిశీలించాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, ఎన్నికల కమిషనే వాయిదా వేసిన మైదుకూరు సహా 4 చోట్ల మాత్రమే.. అదీ కొన్ని వార్డులకే కొత్తగా నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మున్సిపల్‌ ఎన్నిక­లను బుధవారం వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌ చంద్ర పునే­ఠ గురువారం కొత్త షెడ్యూల్‌ ప్రకటించారు.

తాజా షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగ­ర పంచాయతీలకు పోలింగ్‌ ఈ నెల 28కి బ­దులు వచ్చే నెల (నవంబర్‌) 1న నిర్వహిస్తా­రు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. పరోక్ష పద్ధతిలో నిర్వహించే డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికల తేదీలను ప్రత్యేకంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. మూడు రోజుల క్రితం ఎన్నిక వాయిదా వేసిన మైదుకూరుకు కూడా మిగిలిన మున్సిపాలిటీలతో కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. 

72 వార్డులకే తిరిగి నామినేషన్లు 
కడప, తిరుపతి నగర పాలక సంస్థలతో పా­టు రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు మాత్రమే కొత్తగా నామినేషన్లు  స్వీకరించనున్నట్టు ఎస్‌ఈసీ ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్‌లో 18, కడపలో 11, రాజంపేటలో 11, మైదుకూరులోని మొత్తం 32 వార్డులకు శుక్రవారం (23వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి శనివారం (24వ తేదీ) మ. 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్ణయించిన కేంద్రాలతోపాటు కలెక్టరేట్లలోనూ నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.

కొత్త నామినేషన్లను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పరిశీలిస్తారని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో   పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాలను ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటిస్తామని వెల్లడించారు. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు జరిగే 3వ తేదీనే రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరగనుంది.

కొత్తగా నామినేషన్లు స్వీకరించే వార్డులు 
తిరుపతి నగరపాలక సంస్థ: 1,2, 3, 4, 5, 6, 9, 11, 12,13, 14, 19, 55, 56, 57,59,65, 66 వార్డులు 
కడప నగరపాలక సంస్థ: 6, 11, 13, 15, 16, 17, 24,31, 34, 52, 55 వార్డులు 
రాజంపేట పురపాలక సంఘం: 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27 వార్డులు 
మైదుకూరు పురపాలక సంఘం:    మొత్తం 32 వార్డులు

సవరించిన షెడ్యూల్‌..  
అక్టోబర్‌ 23, 24: కొత్త నామినేషన్ల స్వీకరణ 
అక్టోబర్‌ 25:  ఉదయం 8 గంటల నుంచి కొత్త నామినేషన్ల పరిశీలన 
అక్టోబర్‌ 25: మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్త నామినేషన్ల ఉపసంహరణ గడువు 

అక్టోబర్‌ 25: మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల 
నవంబర్‌ 1: ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ 
నవంబర్‌ 2: అవసరమైన చోట్ల రీపోలింగ్‌ 
నవంబర్‌ 3: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement