ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు | Intermediate exams from February 24 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Oct 23 2026 5:58 AM | Updated on Oct 23 2026 5:58 AM

Intermediate exams from February 24

ఆ రోజు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం

మరుసటి రోజు నుంచి రెండో సంవత్సరం పరీక్షలు

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు 

అదే నెల 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో ప్రాక్టికల్స్‌

పరీక్షల టైంటేబుల్‌ విడుదల చేసిన ఇంటర్‌ విద్యా మండలి

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి, రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల తాత్కాలిక టైం టేబుల్‌ను విద్యా మండలి గురువారం విడుదల చేసింది. రాత పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి మధ్యా­హ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి. 

ప్రాక్టికల్స్‌ రోజూ రెండు సెషన్లలో ఉద­యం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. సమగ్ర శిక్ష ఒకేషనల్‌ ట్రేడ్‌ పరీక్ష ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇవే తేదీల్లో ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు కూడా ఉంటాయని, ఆ టైం టేబుల్‌ విడిగా విడుదల చేస్తామని కార్యదర్శి ప్రకటించారు. బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాత సిలబస్‌ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలిపారు.

ముఖ్యమైన పరీక్షల వివరాలు.. 
» ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ – జనవరి 27  
» ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ – జనవరి 29  

ప్రాక్టికల్‌ పరీక్షలు 
» జనరల్‌ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్‌ కోర్సులకు ఫిబ్రవరి 15 వరకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement