AP Political News Dec 30th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Dec 30th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Dec 30th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Dec 30 2023 7:19 AM | Updated on Dec 30 2023 8:35 PM

AP Elections Today Political News Updates And Headlines December 30th In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

07:02PM, డిసెంబర్‌ 30, 2023

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌

  • నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 200 మంది యువకులు
  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి..
  • రెండు నెలల తర్వాత సోమిరెడ్డి కనుమరుగై పోతాడు 
  • 2024 ఎన్నికల్లో నాకు శుభం కార్డ్.. సోమిరెడ్డికి ఎండ్ కార్డు 

04:30 PM, డిసెంబర్‌ 30, 2023

కాపులను అణిచి వేసేందుకు చంద్రబాబు కుట్ర: కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు

  • అటువంటి బాబు కుట్రలో పవన్ కల్యాణ్ భాగస్తుడు
  • అందుకే ఆ సామాజికవర్గ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న పవన్‌కళ్యాణ్‌
  • ప్రతి చోటా ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు
  • చంద్రబాబు మేలు కోసమే పవన్‌ రాజకీయాలు
  • కాపులకు పవన్ కల్యాణ్ చేసిన మేలేమిటి..?
  • కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా..?
  • కాపులను కట్టకట్టి అమ్మేయాలని చూస్తున్న పవన్ కావాలా?
  • కాపులను గౌరవించి కాపు కాస్తున్న జగన్ కావాలా?
  • కాపు సోదరులంతా విజ్ఞతతో ఆలోచించాలి

04:03 PM, డిసెంబర్‌ 30, 2023
దత్తపుత్రుడి నోటి వెంట ఇన్ని అబద్దాలా? విషం జల్లేందుకు ఇంకేం దొరకలేదా? : YSRCP

ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగింది పవన్ పసలేని, అబద్దపు ఆరోపణలు

వాస్తవాలేంటో చూద్దామా?

  • ఇళ్ల నిర్మాణం కోసం  ప్రభుత్వ స్థలాలు లేనిచోట ప్రైవేటు స్థలాలు తీసుకోవాల్సి వస్తుంది
  • ఒకేచోట  50 నుంచి 60 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది
  • కొంతమంది రైతులు భూములు ఇవ్వటానికి ఇష్టపడకపోవచ్చు
  • నచ్చచెప్పి మార్కెట్ ధర కు కొనాల్సివస్తుంది. ఇందులో అవినీతి ఏముంది?
  • బాబు నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు
  • బాబు హయాంలో  ఒక్క టిడ్కో ఇల్లు కూడా పూర్తి చేయలేదు.
  • పైగా రూ.3000 కోట్లు పెండింగ్ బిల్లులు పెడితే వాటిని సీఎం జగన్‌ హయాంలో చెల్లించారు
  • సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 82 వేల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇచ్చింది.
  • 2.62  లక్షల టిడ్కో ఇళ్ల మీద ఇప్పటికే రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టింది జగన్ ప్రభుత్వం
  • సీఎం ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలమూ కూడా సామాన్యులకు ఇవ్వలేదు చంద్రబాబు
  • కానీ పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు జగన్
  • అమరావతిలో  పేదలకు ఇళ్లు కేటాయిస్తే, మా కుల సమీకరణలు దెబ్బతింటాయని కోర్టులో కేసు వేయించాడు బాబు
  • తన 5 ఏళ్ల పాలనలో  పేదలకు కనీసం ఒక్క సెంటు స్థలమూ ఇవ్వని, ఒక్క ఇల్లూ కట్టని నీ పార్ట్ నర్ చంద్రబాబు నీ కంటికి విజనరీగా కనిపిస్తున్నాడా?
  • 31 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన జగన్  నీ కంటికి విధ్వంసకారుడిగా కనిపిస్తున్నాడా?
  • నీ తిక్క వెనుక ఎంత ‘లెక్క’ ఉందో ఫ్లవర్ స్టార్?

03:15 PM, డిసెంబర్‌ 30, 2023
విజనా.? విస్తరాకుల కట్టా? : చంద్రబాబుకు YSRCP చురకలు

కుప్పంలో పండించిన కూరగాయలను విమానంలో తీసుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తాను : చంద్రబాబు

  • విజనా విస్తరాకుల కట్టా? సీనియారిటీయా సింతకాయా?
  • ఇంతవరకు ఇండియాలోనే జరగని ఒలింపిక్స్ ని అమరావతిలో నిర్వహిస్తామని చెప్పిన బాబు విజనరా ?
  • ఇంతవరకు ఇండియాలోనే లేని బుల్లెట్ రైల్ ను  ఏపీలో ప్రతి జిల్లాలో తెస్తానని చెప్పిన బాబు విజనరా ?
  • నీళ్ళు ఉన్నా లేకున్నా ప్రతి జిల్లాల్లో సీ పోర్టు నిర్మిస్తానని చెప్పిన బాబు విజనరా ?
  • కుప్పం లో విమానాశ్రయం కట్టి కూరగాయలను ప్రపంచదేశాలకు అమ్మిస్తానన్న బాబు విజనరా ?
  • 108 వాహనాలను సరిగా నడపలేక మూలన పడేసిన చంద్రబాబు.. ఏకంగా ఎయిర్ అంబులెన్సులను(హెలికాప్టర్ ) తెస్తాననడం విజనా ?
  • సూర్యుడితో (తాను కానీ పెట్టిన సెల్ ఫోన్లో) మాట్లాడి అమరావతిలో ఉష్ణొగ్రతలను 10 డిగ్రీలు తగ్గిస్తానన్న బాబు విజనరా ?
  • అమరావతి పల్లెలను పెపంచ రాజధానిగా చేస్తానన్న బాబు విజనరా ?
  • సముద్రాన్ని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తానన్న బాబు విజనరా ?
  • నేనుంటే కరోనా వచ్చేదా ? అన్న బాబు విజనరా ?
  • ఒలింపిక్స్ లో గెలిచినవారికి నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తానన్న బాబు విజనరా ?
  • కోడి పుంజుకే కోడిగుడ్డును తినిపించిన బాబు విజనరా ?

03:53 PM, డిసెంబర్‌ 30, 2023
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్ద పీట వేశారు: పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

  • నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పగలిగే దమ్ము ఉన్న నేత సీఎం జగన్.
  • 14 ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు సామాజిక న్యాయం ఎందుకు చేయలేకపోయారు..
  • బడుగు బలహీనర్గాలను చంద్రబాబు అవమానించారు
  • 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది

03:51 PM, డిసెంబర్‌ 30, 2023

టీడీపీ పాలనలో సామాజిక న్యాయం మాటలకే పరిమితం : ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ

  • కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు..
  • రెండు లక్షల 40 వేల కోట్ల ప్రజల ఖాతాల్లో వేశారు..

02:05 PM, డిసెంబర్‌ 30, 2023
సీఎం జగన్‌ పాలన బీసీలకు స్వర్ణయుగం: ఎంపీ ఆర్‌ కృష్ణయ్య

  • నోరులేని వాళ్లకి సీఎం జగన్‌ అండగా ఉంటున్నారని.. నోరున్న కొంతమంది సీఎంపై కోపంగా ఉన్నారు.
  • వైఎస్‌ జగన్‌కు మనమంతా అండగా ఉండాలి
  • జగన్‌ రాజకీయ నాయకుడు కాదు.. ఒక సంఘ సంస్కర్త
  • ప్రతి ఒక్కరిని సీఎం జగన్‌ తన కుటుంబసభ్యుడిగానే భావిస్తారు
  • మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలిస్తే మరెన్నో పథకాలు వస్తాయి

01:42 PM, డిసెంబర్‌ 30, 2023
లోకేష్‌కి బీసీలంటే గౌరవం లేదు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

  • మేనిఫెస్టో అంటే కూడా లోకేష్‌కి తెలియదు
  • బీసీల తోక కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు
  • ఒక్క బీసీనైనా చంద్రబాబు రాజ్యసభకు పంపారా?
  • సీట్లను అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు
  • బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు
  • సీఎం జగన్‌ హయాంలో పాలకొల్లులో శరవేగంగా అభివృద్ధి పనులు
  • టీడీపీ హయాంలో వేల్పూరులో రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించలేదు
  • రూ.18 కోట్లు సీఎం జగన్‌ మంజూరు చేశారు 
  • రామానాయుడు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెబుతారు
  • మూడు పర్యాయలు సీఎం అయిన చంద్రబాబు ఒక్క బీసీనైన రాజ్యసభకు పంపారా?
  • బీద మస్తాన్ రావు ,మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపారు
  • పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలి
  • రూ.100 కోట్లకి 50 కోట్లకు సీట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు

12:59 PM, డిసెంబర్‌ 30, 2023
విశాఖ: తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీటు

  • ఎంపీ సీటుకు రూ.150 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ.50 కోట్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని కండీషన్‌
  • ఖర్చు చేయగలిగిన వారికే పార్టీలో సీట్లంటున్న చంద్రబాబు
  • 3 ప్రాంతాల్లో డిపాజిట్‌ మొదలు పెట్టిన చంద్రబాబు
  • బాబు తీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • రూ.కోట్లు ఉంటే సీట్లు అంటున్న బాబు వైఖరిపై ఆగ్రహం
  • కష్టపడే వారికి పార్టీలో విలువ లేదంటూ మండిపాటు

11:51 AM, డిసెంబర్‌ 30, 2023
కాకినాడలో కొలిక్కిరాని పవన్‌ కళ్యాణ్‌ కసరత్తులు

  • తూర్పుగోదావరిలో తప్పుతున్న పవన్‌ అంచనాలు
  • ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అద్భుత ఫలితాలు వస్తాయని తొలుత పవన్‌కు చెప్పిన నేతలు
  • తీరా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
  • నియోజకవర్గాల వారీగా పవన్‌ చేస్తోన్న సమీక్షల్లో తేడా కొడుతోన్న పరిస్థితులు
  • మూడు రోజులుగా కాకినాడలోనే మకాం వేసి జనసేన నేతలను కలుస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
  • చాలా వరకు మీడియాకు అనుమతి లేకుండా అంతర్గత సమావేశాలు
  • తమ అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉందని తేల్చుతున్న నివేదికలు
  • కాకినాడలో 15 డివిజన్ల కార్యకర్తలతో పవన్ భేటీ 
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జులతో సమావేశం 
  • నిన్న రాత్రి పవన్ ను కలిసిన జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  • అసలు తెలుగుదేశం-జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదని చెప్పిన చంటిబాబు

11:32 AM, డిసెంబర్‌ 30, 2023
సీఎం సీట్‌ షేరింగ్‌ ఉంటేనే పొత్తు: కుప్పం జనసేన నేతల స్పష్టీకరణ

  • కుప్పంలో జనసేన భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
  • జనసేన ఉమ్మడి చిత్తూరు అధ్యక్షుడు పసుపులేటి హరి ప్రసాద్  అధ్యక్షతన జరిగిన సమావేశం
  • చంద్రబాబు అలా వెళ్లగానే.. జనసేన నాయకుల రచ్చ 
  • చంద్రబాబును సీఎం చేస్తామని మీరెలా ప్రకటిస్తారని హరిప్రసాద్‌పై జనసైనికుల ఆగ్రహం
  • హరిప్రసాద్తో కుప్పం జనసేన నేతల ఘర్షణ 
  • పవన్ కల్యాణ్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్
  • ఎన్నికల తర్వాత రెండున్నరేళ్ల చొప్పున పవన్‌కు సీఎం ఇస్తామని ముందే ప్రకటించాలని నినాదాలు
  • సీఎం సీట్‌ షేరింగ్‌ ఉంటేనే పొత్తు ఉంటుందని నినాదాలు
     

11:15 AM, డిసెంబర్‌ 30, 2023
సైకిల్‌.. గాజు గ్లాస్‌ కలిసే సీను లేదు.!

  • పవన్ కల్యాణ్ పిలిస్తే వెళ్లాను : ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  • కాకినాడ జిల్లా రాజకీయాలపై పవన్‌ అడిగి తెలుసుకున్నారు
  • జగ్గంపేటలో TDP, జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదు
  • జనవరి 1న అనుచరులతో సమావేశం

11:04 AM, డిసెంబర్‌ 30, 2023
నెల్లూరు సిటిలో టీడీపీ, జనసేనకు షాక్..

  • ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో YSRCP తీర్ధం పుచ్చుకున్న 39వ డివిజన్ టిడిపి, జనసేన పార్టీల కార్యకర్తలు
  • మాజీమంత్రి నారాయణ, జనసేన వేరువేరుగా పర్యటించి ప్రజలను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు
  • జనసేన నేతలకు టీడీపీ నుంచి ప్యాకేజీలు అందాయి
  • మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం : అనిల్‌

10:43 AM, డిసెంబర్‌ 30, 2023
సామాజిక నినాదం.. ప్రజలతో మమేకం

  • నేడు 37వ రోజు సామాజిక సాధికార యాత్ర
  • నంద్యాల, నర్సీపట్నం, తాడికొండలలో జరగనున్న బస్సుయాత్ర
  • నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర
  • ఉదయం 11 : 30 గంటలకు నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్లో మేథావులతో సమావేశం
  • అనంతరం 2 గంటలకు YSRCP నేతల మీడియా సమావేశం
  • సాయంత్రం 3:20 నిమిషాలకు  శ్రీనివాస్ సెంటర్ నుండి పాదయాత్ర ప్రారంభం
  • 4 గంటలకు గాంధీ చౌక్ సెంటర్ లో బహిరంగ సభ
  • హాజరుకానున్న డిప్యూటి CMలు అంజద్ భాషా, నారాయణ స్వామి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తదితరులు
  • అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • ఉదయం 10:30 గంటలకు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
  • 11 గంటలకు భీమబోయపాలెం దగ్గర మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పరిశీలన
  • మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మీడియా సమావేశం
  • మధ్యాహ్నం 2 గంటలకు మాకవరపాలెం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం
  • 3 గంటలకు అభిధ్ సెంటర్ వద్ద బహిరంగ సభ
  • హాజరుకానున్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ, తదితరులు
  • గుంటూరు జిల్లా తాడికొండలో మాజీమంత్రి సుచరిత ఆద్వర్యంలో బస్సుయాత్ర
  • మధ్యాహ్నం మూడు గంటలకు తాడికొండ అడ్డరోడ్ వద్ద వైసీపి నేతల మీడియా సమావేశం
  • అనంతరం ర్యాలీ ప్రారంభం
  • 4 గంటలకు తాడికొండ బస్టాండు సెంటర్ లో బహిరంగ సభ
  • హాజరుకానున్న మంత్రి జోగి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులు

10:03 AM, డిసెంబర్‌ 30, 2023
బీసీలను అవమానించింది చంద్రబాబే.. మంత్రి చెల్లుబోయిన వేణు

  • బీసీల రక్షణ చట్టం తెస్తానంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌ ప్రకటించడం ఆ వర్గాలను మరోసారి మోసగించడానికే
  • ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ చంద్రబాబు ఎస్సీలను అపహాస్యం చేశారు
  • నాయీ బ్రాహ్మణులను మంగలి అని పిలిచిన బాబు శిక్షార్హుడే
  • చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం ఇవ్వని బాబు అండ్‌ కోను బీసీలు నమ్మరు
  • బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు మొదటి ముద్దాయి చంద్రబాబే
  • లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో బీసీలకు ప్రత్యేక కేటాయింపులంటూ లోకేశ్‌ మాట్లాడటం విడ్డూరం
  • 1999లో బీసీలకు 100 సీట్లిస్తానని కనీస సీట్లు కూడా ఇవ్వలేదు
  • సీఎం జగన్‌ను సైకో అనడం సమంజసం కాదు.. లోకేశే సైకోగా మారాడు
  • బీసీలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభలో నాలుగు స్థానాలు కేటాయించారు
  • సామాజిక న్యాయానికి ఏపీని చిరునామాగా మార్చారు.

08:40 AM, డిసెంబర్‌ 30, 2023
నేడు 37వ రోజు సామాజిక సాధికార యాత్ర

  • నంద్యాల, నర్సీపట్నం, తాడికొండలలో జరగనున్న బస్సుయాత్ర
  • నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర
  • ఉదయం 11: 30 గంటలకు నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్లో మేధావులతో సమావేశం
  • అనంతరం 2 గంటలకు వైసీపీ నేతల మీడియా సమావేశం
  • సాయంత్రం 3:20 నిమిషాలకు  శ్రీనివాస్ సెంటర్ నుండి పాదయాత్ర ప్రారంభం
  • 4 గంటలకు గాంధీ చౌక్ సెంటర్‌లో బహిరంగ సభ
  • హాజరుకానున్న మంత్రులు అంజద్ బాషా, నారాయణ స్వామి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తదితరులు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర

  • ఉదయం 10:30 గంటలకు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
  • 11 గంటలకు భీమబోయపాలెం దగ్గర మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలన
  • మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మీడియా సమావేశం
  • మధ్యాహ్నం 2 గంటలకు మాకవరపాలెం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం
  • 3 గంటలకు అభిద్‌ సెంటర్ వద్ద బహిరంగ సభ
  • హాజరుకానున్న రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ తదితరులు

గుంటూరు జిల్లా తాడికొండలో మాజీ మంత్రి సుచరిత ఆధ్వర్యంలో బస్సుయాత్ర

  • మధ్యాహ్నం మూడు గంటలకు తాడికొండ అడ్డరోడ్ వద్ద వైసీపీ నేతల మీడియా సమావేశం
  • అనంతరం ర్యాలీ ప్రారంభం
  • 4 గంటలకు తాడికొండ బస్టాండు సెంటర్ లో బహిరంగ సభ
  • హాజరుకానున్న మంత్రి జోగి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులు

08:33 AM, డిసెంబర్‌ 30, 2023
నేను వైఎస్సార్‌సీపీ విధేయుడిని.. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు   

  • సీఎం జగన్‌ ఎవరికి టికెట్‌ ఇచ్చినా స్వాగతిస్తా
  • వైఎస్సార్‌సీపీ గెలవడమే ముఖ్యం
  • సీఎం జగన్‌ సహకారంతో ఎమ్మెల్యేగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాను
  • రాజకీయాల్లో ఎన్నో సమీకరణాలు జరుగుతాయి
  • పార్టీకి మేలు జరుగుతుందంటే ఎవరికి అవకాశమిచ్చినా స్వాగతిస్తా
  • గతంలో నాకు తోట నరసింహం సహకరించారు
  • ఇప్పుడు ఆయనకు టికెట్‌ ఇచ్చినా నేను కచ్చితంగా సహకరిస్తా
  • ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడమే ముఖ్యం
  • నియోజకవర్గంలో కొత్తగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా.. పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సా­గాలి.
  • నేను పార్టీ మారుతానంటూ రకర­కాల పుకార్లు షికారు చేస్తున్నాయి.. అవన్నీ నిజం కాదు
  • ఎన్నికలకు ఇంకా సమ­యం ఉంది. మరో మూడు నెలలు నేనే ఎమ్మెల్యేగా ఉంటా
  • నాకు ఇచ్చిన అవకాశం­తో ఎంత సేవ చేశానన్నదే నాకు ముఖ్యం

08:22 AM, డిసెంబర్‌ 30, 2023
కుప్పంలో జనసేన నేతల బాహాబాహీ
పవన్‌ రాజకీయ కార్యదర్శి పసుపులేటిపై దాడికి యత్నం  
చంద్రబాబుతో పరిచయ కార్యక్రమంలో జనసేన కార్యకర్తల మధ్య భగ్గుమన్న విభేదాలు
జనసేన పార్టీలో నివురుగప్పిన నిప్పులా వర్గ విభేదాలు

07:33 AM, డిసెంబర్‌ 30, 2023
మోసాలు, కుట్రలు, కుతంత్రాలు

  • ఇవే దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడి మేనిఫెస్టో 
  • భీమవరం సభలో నిప్పులు చెరిగిన సీఎం వైఎస్‌ జగన్‌  
  • చంద్రబాబు పాలన మొత్తం అవినీతి, అభూతకల్పన 
  • దోచుకున్న సంపద దుష్ట చతుష్టయానికి బిస్కెట్లుగా పంపకం 
  • పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన ఘనుడు దత్తపుత్రుడు 
  • సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా చిత్తం బాబూ అనే త్యాగరాజు ఈ ప్యాకేజీ స్టార్‌
       

07:25 AM, డిసెంబర్‌ 30, 2023
చంద్రబాబు దింపుడు కల్లం ఆశ.. అందుకేనట బాబు రహస్య మంతనాలు!

  • కనుచూపుమేర కానరాని విజయ సూచికలు
  • పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ అంతా నో యూజ్
  • తాజాగా డీకే శివకుమార్‌తో భేటీ
  • అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్థితి
  • చచ్చిన తెలుగుదేశాన్ని లేపి.. మళ్ళీ నాగినీ డాన్స్ అందించడానికి అయన ఎన్ని విధాలా నాగ స్వరం ఊదుతున్నా అయన బుగ్గలు నెప్పెడుతున్నాయి తప్ప పాము లేవడం లేదు.
  • కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని పార్టీకి బలం చేకూరుద్దామని ప్రయత్నించారు
  • అబ్బే.. కుదరలేదు. గజ్జి తగ్గడానికి మందు రాస్తే ఆ గజ్జి చేతికి అంటుకుంది తప్ప గజ్జి మానలేదు
  • చంద్రబాబుతో అంటకాగిన కొద్దీ పవన్ కళ్యాణ్ బలహీనం అయ్యాడు కానీ టీడీపీకి లాభం రాలేదు
  • పైగా కాపులు ఇప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలిపి జాయింటుగా టార్గెట్ చేసి తిడుతున్నారు
  • దీంతో ఆ పీకే అచ్చిరాలేదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK )ను తెచ్చారు
  • రోగిలో చలనం లేనపుడు, అవయవాలన్నీ చచ్చుబడిపోయినపుడు ఎంత పెద్ద డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు
  • కడసారి చూపులు చూసుకోండి అని చెప్పేసినట్లు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు
  • దీంతో ఇక చంద్రబాబుకు మిగిలింది దింపుడు కల్లం ఆశ మాత్రమే మిగిలింది
  • దీంతో ఇప్పుడు తాజాగా మంచి సక్సెస్ రికార్డ్‌తో దూసుకుపోతున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.
  • కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం దగ్గర్నుంచి తెలంగాణాలో అసలు రేసులోనే లేని కాంగ్రెసును అధికార పీఠం ఎక్కించిన ఎపిసోడ్ తాలూకు క్రెడిట్ మొత్తం డీకే శివకుమార్ కు దక్కింది.
  • దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకుని కొన్ని ఎత్తులు.. పొత్తులు.. జిత్తులను ప్లాన్ చేసే నిమిత్తము ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది
  • అటు ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.. ఎటు చూసినా కారుచీకటి. గెలిచే సీట్ ఎక్కడా కానరావడం లేదు
  • ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం కుప్పంలో పోటీకి భయపడి రెండోచోట పోటీ చేస్తారని అంటున్నారు

07:04 AM, డిసెంబర్‌ 30, 2023
తూర్పు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది?

  • కాకినాడలో ఎడతెగని మంత్రాంగంలో పవన్‌ కళ్యాణ్‌
  • జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి
  • కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి సమీక్ష
  • గత నాలుగున్నరేళ్ళ నుండి వార్డు స్ధాయి కమీటీలు ఎందుకు వేయలేదని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
  • గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఆందోళనలు, ప్రజా ఉద్యమాలు చేశారని ప్రశ్నించిన పవన్
  • పవన్ ప్రశ్నలకు బిక్క ముఖం వేసిన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు
  • వచ్చే ఎన్నికలకు త్యాగాలకు సిద్దం కావాలని స్పష్టత ఇచ్చిన పవన్
  • కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి సహకరించడం లేదని పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన నేతలు
  • జగ్గంపేట సీటు టిడిపికి ఇస్తే సహకరించేది లేదన్న పాఠంశెట్టి సూర్యచంద్ర
  • పెద్దాపురం సీటు జనసేనకు ఇవ్వాలని పట్టుబడిన తుమ్ముల బాబు
  • పిఠాపురం నుండి జనసేన పోటీ చేస్తే టిడిపి నేత వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని పవన్ కు చెప్పిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్
  • మిగతా సీట్లు సరే, భీమవరంలో పరిస్థితేంటని ప్రశ్నించిన పవన్‌ కళ్యాణ్‌
  • భీమవరంలో జనసేన గెలిచే అవకాశాలపై పవన్‌కళ్యాణ్‌ ఆరా
  • తెలుగుదేశం మద్ధతిస్తే జనసేన బయటపడుతుందా అన్న విషయంపై చర్చ
  • మరో సారి భీమవరం నుంచి అదృష్టం పరీక్షించుకునే యోచనలో పవన్‌ కళ్యాణ్‌
  • ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోతే .. పొలిటికల్‌ కెరియర్‌ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో పవన్‌ కళ్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement