NCP Leader Ajit Pawar Took Oath as Deputy Chief Minister at Raj Bhawan - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌.. డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్‌

Jul 2 2023 2:13 PM | Updated on Jul 2 2023 3:26 PM

Ajit Pawar Meets Governor With 30 MLAs - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను పార్టీకి వర్కింగ్  ప్రెసిడెంట్లుగా నియమించిన నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్.. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు.

రాజ్‌భవన్‌కు చేరుకున్న అజిత్‌పవార్‌ గవర్నర్‌కు మద్దతు లేఖ ఇచ్చారు. షిండే మంత్రివర్గంలోకి చేరిన అజిత్‌పవార్‌.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజున మీడియా ముందు ముఖం చాటేసిన అజిత్ పవార్ తర్వాత ఓ సందర్భంలో తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవర్ అంతలోనే ఇంతటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు ఎన్సీపీ వర్గాలు.

ఇదే అదనుగా ముఖ్యమంత్రి షిండే వర్గం పావులు కదిపి అజిత్ పవార్‌తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో చీలిక జరిగిందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.  అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారితో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలుపుతోంది షిండే వర్గం.

ఇది కూడా చదవండి: SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్ 

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement