‘స్పీకర్‌ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’ | Aditya Thackeray says NDA Allies, Asks TDP, JDU to get the speaker post | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ పదవిపై ఎన్డీయే మిత్రపక్షాలకు యువ నేత సూచన

Published Tue, Jun 11 2024 11:26 AM

Aditya Thackeray says NDA Allies, Asks TDP, JDU to get the speaker post

ముంబై:  లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.

టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి  మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత  ఆదిత్య ఠాక్రే  హెచ్చరించారు.

 

‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్‌ పదవి డిమాండ్‌ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్‌​’ వేదికగా అన్నారు.

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు  స్పీకర్‌ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement