బీజేపీ రావణుడిని పూజించాలి | Adhir Ranjan Chaudhary Controversial comments on BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ రావణుడిని పూజించాలి

Aug 7 2022 4:55 AM | Updated on Aug 7 2022 4:55 AM

Adhir Ranjan Chaudhary Controversial comments on BJP - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడిని కాదు, రావణుడిని పూజించండి అని అధికార భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాముడి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారని గుర్తుచేశారు.

రావణాసురుడి పాలనలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు మన దేశంలో జనం అలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని తెలిపారు. అందుకే బీజేపీ నాయకులు రాముడి స్థానంలో రావణుడిని ఆరాధిస్తే మంచిదని అన్నారు. ‘రామా’ అనే ఒకే ఒక్క ఆయుధంతో ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తోందని అధిర్‌ రంజన్‌ ఆక్షేపించారు.

Advertisement
 
Advertisement
Advertisement