రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి | Abhijit Gangopadhyay Announces Joining BJP After Resigning | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి

Mar 5 2024 4:56 PM | Updated on Mar 5 2024 5:30 PM

Abhijit Gangopadhyay Announces Joining BJP After Resigning - Sakshi

'అభిజిత్ గంగోపాధ్యాయ' కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన తరువాత.. బీజేపీలో చేరుతున్నట్లు ఈ రోజు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 7న బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు.

బెంగాల్‌లో టీఎంసీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో చేరుతున్నట్లు అభిజిత్ గంగోపాధ్యాయ ప్రకటించారు. జస్టిస్ గంగోపాధ్యాయ న్యాయమూర్తిగా తన పనిని పూర్తి చేసినట్లు, చివరి రోజు పెండింగ్‌లో ఉన్న 60 విషయాలను పరిష్కరించినట్లు, ఒక కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు.

హైకోర్టులో ప్రాక్టీస్ లాయర్‌గా 24 ఏళ్లపాటు పనిచేసిన జస్టిస్ గంగోపాధ్యాయ 2018 మే 2న అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు అధికారిక రికార్డుల ప్రకారం జూలై 30, 2020న శాశ్వత న్యాయమూర్తి హోదాను పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement