కరీంనగర్‌లో జూడోకు ఇది కొత్త కాదు. గతంలో 2016లో కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థలలో 62వ జాతీయస్థాయి పాఠశాలల అండర్– 17 జూడో జాతీయస్థాయి పోటీలు ఘనంగా నిర్వహించిన అనుభవం ఉంది. సుమారు 20కిపైగా వివిధ కేటగిరిలలో రాష్ట్రస్థాయి జూడో పోటీలకు జిల్లా ఆతిథ్యమిచ్చింది. అంతేకాకుండా సీఎం కప్– 2024లో రాష్ట్రస్థాయి జూడో పోటీలను సైతం అట్టహాసంగా నిర్వహించింది. ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జూడోకు అవసరమైన సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఖేలో ఇండియా జూడో సెంటర్ కరీంనగర్‌లో ఉండటం జిల్లాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
– కడారి అనంతరెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్యాట్రన్


