కోల్‌సిటీ: అభివృద్ధి పనులకు సాంకేతిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కో రారు. మంగళవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ సాయపరెడ్డిని మేయర్ కలిసి వినతిపత్రం అందించారు. అంతకుముందు హైదరాబాద్ గాంధీభవన్‌లో ని ర్వహించిన కాంగ్రెస్ జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ పాల్గొన్నారు.
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
కోల్‌సిటీ: చీకటిలో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్రదానం మహత్తర మా నవతా కార్యక్రమమని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందుసింగ్ అన్నారు. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం జీజీహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎ ల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ రూపొందించిన అవగాహన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ఒకరి మరణం మరోఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అ కాల మరణం చెందిన వారికార్నియాలను దా నం చేసేందుకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ, జీజీహెచ్‌లోనే సేకరించేలా చొ రవ తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా ఎ ల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో కృపాభాయి, కంటివైద్య విభాగం అ సిస్టెంట్ ప్రొఫెసర్ చెట్టి గోపీకృష్ణ, ఎల్వీ ప్ర సాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్య దర్శి కేఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు.


