పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రా ధాన్యం ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో అర్జీ లు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడా రు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంథనిలోని సర్వే నంబరు 94లో అక్రమ పట్టాలతో రిజి స్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిని రద్దు చేయాలి.
– మంథని రాజగోపాల్,
మంథని
దివ్యాంగురాలిని. పక్షవాతంతో ఇబ్బందిపడుతున్న. కార్యాలయంలో చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న. పింఛన్ మంజూరు చేయండి.
– జి.లక్ష్మి, అప్పన్నపేట
గత యాసంగిలో మొక్కజొన్న కోసమని పెద్దపల్లిలోని ఓంసాయి ఫెర్టిలైజర్‌లో మందులు కొన్న. క్రాప్ రాకపోగా భారీగా నష్టం వాటిల్లింది. రసీదు ఉంది.
– ఆవుల తిరుపతి, రేగడిమద్దికుంట
నాకు ఆధార్ ఉంది. ఆన్‌లైన్‌లో వెతికితే మరొకరి వివరాలు వస్తున్నయి. భూమి రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతన్నయి. స్కీంలు రావడం లేదు. నా కూతురు శ్రీవాణి వికలాంగురాలు. పింఛన్ రావడంలేదు.
– రెడ్డి సునీత, శ్రీవాణి
విద్యార్థుల డ్రెస్సులు కుట్టాలని డీఆర్డీవో అధికారు లు ఆర్డరు ఇచ్చారు. వారంరోజుల్లో కుట్టిస్తామని చెప్పినా వినకుండా మరొకరికి ఇచ్చారు. నిబంధన ల ప్రకారం కుట్టు శిక్ష పొందినవారికి ఉపాధి కల్పి ంచాలి. మా ఉపాధిని దెబ్బతీసిన వారిపై చర్య తీసుకోవాలి.
– మాధవి, అరుణ అనంత, రాధిక, స్రవంతి, సుల్తానాబాద్


