విద్యా ప్రమాణాల పెంపు ఎన్టీపీసీ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల పెంపు ఎన్టీపీసీ లక్ష్యం

Jul 22 2026 11:05 AM | Updated on Jul 22 2026 11:05 AM

విద్యా ప్రమాణాల పెంపు ఎన్టీపీసీ లక్ష్యం ● దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాసాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపు లక్ష్యంగా కృషి చేస్తున్నామని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సా మంత అన్నారు. మేడిపల్లి సెంటర్‌ సమీప వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు సీఎస్సార్‌ ద్వారా 10,000 మంది విద్యార్థులకు మంగళవారం నోట్‌బుక్‌ పంపిణీ చేశారు. ఎంఈవో మల్లేశం హాజరయ్యారు. రాఖీ సామంత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఎన్టీపీసీ నిరంతర ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీప్తి మహిళా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement