సాగుకు ముందే ఆన్‌లైన్‌.. | - | Sakshi
Sakshi News home page

సాగుకు ముందే ఆన్‌లైన్‌..

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

సన్నాలు సాగు చేసే రైతులకు కొత్త నిబంధన ఆన్‌లైన్‌లో నమోదు అయితేనే బోనస్‌ వర్తింపు ప్రోత్సహించేలా సర్కారు కసరత్తు బోనస్‌ చెల్లింపుల్లో ఇబ్బందుల్లేకుండా చర్యలు

మంథనిరూరల్‌: సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, వ్యవసాయశాఖ నడుం బిగించాయి. సన్నరకానికే బోనస్‌ వర్తింపజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాయి. సాగుకు ముందే సన్నరకం సాగుచేసే రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేసుకునేలా నిబంధనలు విధించాయి. ఈక్రమంలో తమ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు.

2లక్షల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు..

ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షలకుపైగా వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎల్‌నినో ప్రభావంతో సన్నాలు మాత్రమే సాగు చేయాలని, వాటికే బోనస్‌ ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఏడు రకాల సన్నరకం విత్తనాలను కొనుగోలు చేసి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక నాట్లు ఆలస్యమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సన్నాలను ప్రోత్సహించేలా..

జిల్లాలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కేఎన్‌ఎం 1638, బీపీటీ 5204, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, డ బ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 7715లాంటి సన్నర కాలను సాగు చేస్తున్నారు. విత్తనాలను కొనుగోలు చేసిన దుకాణ యజమానికి ఆధార్‌, ప ట్టా, బ్యాంక్‌ పాసుబుక్‌ జిరాక్స్‌, రసీదు ఇస్తే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. కోతలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వివరాలను వెరిి ఫకేషన్‌ చేసినేరుగా బ్యాంకు ఖాతాలో బోనస్‌ జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement