సర్‌లో మీపేరుందా? | - | Sakshi
Sakshi News home page

సర్‌లో మీపేరుందా?

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

జ్యోతినగర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్‌) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్‌వోలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్‌వోలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. ఆ సందేహానికి చాలా సులభమైన పరిష్కారం ఉంది. మీ చేతిలో ఉన్న సాధారణ మొబైల్‌ ఫోన్‌తోనే ఇంట్లో నుంచే, కేవలం ఒక ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా మీ ఓటు వివరాలు సర్‌లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్‌ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్‌తో కూడా తెలుసకోవచ్చు.

ఎలా తెలుసుకోవాలంటే..

మొబైల్‌ మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి ECI (SPACE) EPIC NUMBER (ఓటరు కార్డు) అని టైప్‌ చేసి 1950 నంబరుకు పంపాలి. ఎస్‌ఎంఎస్‌ పంపిన కాసేపటికే ఎన్నికల కమిషన్‌ నుంచి మీ ఓటరు వివరాలతో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. వివరాలు వస్తే మీ పేరు సర్‌ ప్రక్రియలో నమోదు అయినట్లు, రాకపోతే ప్రాసెస్‌లో జాప్యం ఉండటం, సరిగ్గా నమోదు కాలేదని తెలుసుకోవాలి. ECI, EPIC నంబర్ల మధ్య తప్పనిసరిగా స్పేస్‌ ఉండాలి. ఒకవేళ ఎస్‌ఎంఎస్‌ రాకపోతే నెట్‌వర్క్‌లో ఆలస్యం, నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉండవచ్చు. ఈ క్రమంలో మీ ప్రాంతంలోని బూత్‌ లెవల్‌ అధికారి(బీఎల్‌వో)లను సంప్రదించాలి. ప్రతీఓటరు తన వివరాలు ఒకసారి తప్పకుండా పరిశీలించుకోవాలి. మీ ఓటుహక్కు అమూల్యమైనది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మీ సర్‌ నమోదు స్థితిని తెలుసుకోవాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రతీ ఒక్కరు వెంటనే 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపి తమ ఓటుహక్కు నమోదును పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.

ఇలా తెలుసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement