పెద్దపల్లిరూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో వేగం పెంచాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ రాజయ్య, డెప్యూటీ తహసీల్దార్ విజేందర్‌తో కలిసి బీఎల్‌వోలతో సమీక్షించారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో ఉండాలని, పొరపాట్లు లేకుండా సర్వే చేపట్టాలని సూచించారు. ప్రతీఓటరు ఎన్యూమరేటర్ ఇచ్చిన దరఖాస్తు పూర్తిచేసి వారికే ఇవ్వాలని తెలిపారు. ఫారం అందని వారు నేరుగా తహసీల్దార్ ఆఫీసులో పొందవచ్చన్నారు. పూర్తిఆధారాలతో నేరుగా మీ సేవ కేంద్రాల్లోనూ ఉచితంగానే తమ వివరాలు నమోదు చేసుకునే వీలుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


