గోదావరిఖని: ప్రజల పక్షాన నిలిచి, నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే జర్నలిస్టులకు జనాల గుండెల్లో సుస్థిరస్థానం ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్–అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోలిటేరియన్ జర్నలిస్టు మునీర్ పుస్తక పరిచయ సభలో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. మీడియా రంగం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి కనీసం ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. జర్నలిజాన్ని నమ్ముకుని జీవితాంతం అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ అనేక కష్టాలను ఎదుర్కొన్న జర్నలిస్ట్ మునీర్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. జర్నలిస్టుల జీతభత్యాల కోసం సమరశీల పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ప్రధాన పత్రికా రంగంలో వృత్తి ని బద్ధత కోల్పోవడంతో సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిందని చెప్పారు. సోషల్ మీడియాలోని కొన్ని కథనాలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయన్నా రు. ప్రింట్ మీడియా నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రతీవార్తపై నియంత్రణ ఉంటుందన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ మాట్లాడు తూ అక్షరాలను నమ్ముకుని జీవితాంతం పనిచేసిన మునీర్ జీవితం ఆచరణీయమన్నారు. అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామమూర్తి అధ్యక్షతన జ రిగిన సభలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఐజే యూ, టీయూడబ్ల్యూజే జాతీయ నాయకుడు నగు నూరి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, జి ల్లా అధ్యక్షుడు మల్లావఝుల వంశీ, గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.మాధవరావు, గ డ్డం శ్యాంకుమార్, కార్మిక నాయకులు కె.స్వామి, తుమ్మల రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, పర్లపల్లి రవి, ఐ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


