కోతులు గుంపులుగా తిరుగుతున్నయ్. ఇంట్లో జొరబడి ఏది కనిపిస్తే దానిని ఎత్తుకుపోతున్నయ్. ఎవరుంటే వాళ్లపై దాడి చేస్తున్నయి. గతంలో కోతిని చూసి భయంతో బంగ్లాపై నుంచి పడి ఒకామె చనిపోయింది. చిన్నపిల్లలుండే ఇంటి తలుపులు మూసే ఉంచుతున్నరు.
– మిట్టపల్లి శ్రీనివాస్, పెద్దబొంకూర్
వైద్యం అందిస్తున్నాం
రాఘవాపూర్ పీహెచ్‌సీకి నెలలో కనీసం 12 నుంచి 15 మంది వరకు కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రికి వస్తున్నారు. రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, దేవునిపల్లి నుంచే అధికంగా వస్తున్నారు. సకాలంలో వైద్యం అందిస్తున్నాం. అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
– డాక్టర్ మమత, పీహెచ్‌సీ, రాఘవాపూర్


