కృషికి విశేష గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కృషికి విశేష గుర్తింపు

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినందుకు కలెక్ట ర్‌ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాధికారి శారద, అ ధికారులకు విశిష్ట గౌరవం లభించింది. హై దరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సోమవారం ని ర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌, పాఠశా ల విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి పురస్కారం, ప్ర శంసాపత్రం అందుకున్నారు. విద్యా రంగంలో వసతుల కల్పన, ఆన్‌లైన్‌ కార్యకలాపాల సమ ర్థ నిర్వహణ, నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అ భ్యాస ఫలితాల మెరుగుదల, స్కూళ్ల సమర్థ నిర్వహణ వంటి అంశాల్లో జిల్లారాష్ట్రంలోనే ముందంజలో నిలవడంతో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని కలెక్టర్‌ ప్రశంసించారు.

స్కూల్‌ వ్యాన్‌ అడ్డగింత

మంథనిరూరల్‌: భట్టుపల్లి గ్రామంలో విద్యార్థులను చేరవేసే ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్‌ను గ్రా మస్తులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకుండా ప్రైవేటు స్కూల్‌కు పంపించడంపై సర్పంచ్‌ బొగొండ స్వరూప – రవికుమార్‌ ఆధ్వర్యంలో వ్యాన్‌ను అడ్డుకున్నారు. విద్యార్థులను కిందకు దింపివేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని, ప్రైవేటు స్కూల్‌ లో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని ఆమె సూచించారు. ప్రతీగ్రామానికి గుడి ఎంత ము ఖ్యమో, బడి కూడా అంతే ముఖ్యమని తెలి పారు. బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. వార్డు స భ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

గోదావరిఖని: ప్రజాసమస్యల పరిష్కారమే ల క్ష్యంగా గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అ న్నారు. తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డే ద్వారా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారు ల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు వేయాలి

పెద్దపల్లి: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయా లని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్యాంప్రసాద్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో కూరగాయల సాగును ఆయన సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఆయిల్‌పామ్‌ పండించాలని అన్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలపైనా దృష్టి సారించాలని చెప్పారు.

విద్యార్థులపై దాడి సరికాదు

పెద్దపల్లి: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి పోలీసులు లాఠీచార్జీ చేయడం, అక్రమ నిర్బంధాలకు పాల్పడం శోచనీయమని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ వలీ ఉల్లా ఖాద్రి అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి మానస్‌ కుమార్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఏఐవైఎఫ్‌ జిల్లా 4వ మహాసభలో మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయా లని డిమాండ్‌ చేశారు. నాయకులు తాండ్ర స దానందం, మార్కపురి సూర్య, మాచర్ల అంజి, తాళ్లపల్లి సురేందర్‌, ఆసాల నవీన్‌, రాణవేణి సుధీర్‌ కుమార్‌, కల్లేపల్లి నవీన్‌, చంద్రగిరి ఉద య్‌, సాదుల శివ, ఖాజా, శివ పాల్గొన్నారు.

‘వన్‌ నేషన్‌’లో చోటు

ఫెర్టిలైజర్‌సిటీ: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌పై ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు తెలంగాణలో ఆరు జోన్లు వి భజించి పర్యవేక్షణ బాధ్యత లు కేటాయించారు. జూన్‌ –1 ఇన్‌చార్జిగా సోమారపు లావణ్యను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement