హోమాలు కాదు.. కాళేశ్వరం పంపులు ఆన్‌చేయండి | - | Sakshi
Sakshi News home page

హోమాలు కాదు.. కాళేశ్వరం పంపులు ఆన్‌చేయండి

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

ధర్మారం: వర్షాల కోసం వరుణ హోమాలు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలకు పుణ్యం వస్తుంది కానీ వా నలు కురవవని, కాళేశ్వరం పంప్‌లు ఆన్‌చేస్తే నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వ ర్‌ అన్నారు. నందిమేడారం రిజర్వాయర్‌ను సోమ వారం ఆయన సందర్శించి నీటిమట్టం పరిశీలించారు. నీరు తగ్గి మైదానంగా మారిన ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి క్రికెట్‌, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ముత్యాల బలరాంరెడ్డి, రాసూరి శ్రీధర్‌, పుస్కూరి రామారావు, బుచ్చిరెడ్డి, వేణుగో పాల్‌, శ్రీనివాస్‌, తిరుపతి, రమణ, నర్సింగం, రాంబాబు, అపర్ణ, లత, ఆకారి సత్యం పాల్గొన్నారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement