సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

● గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు

జిల్లాలో నమోదైన వ్యాధుల వివరాలు

పెద్దపల్లి: వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో తరచూ సమీక్షిస్తూ ముందస్తు చర్యలు తీసుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత, స్వచ్ఛ మైన తాగునీరు, దోమల నివారణ చర్యలు వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖాధికారి పవిత్ర, పంచాయతీ అధికారి నరేందర్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నా రు. డెంగీ, వైరల్‌ జ్వరాలు, విరేచనాలు వంటి వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రా మాలు, వార్డుల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నా రు. నిల్వనీటి తొలగింపు, ఫాగింగ్‌, యాంటీ లార్వా మందుల పిచికారీ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు వైద్యులు, సిబ్బందిని అందు బాటులో ఉంచుతున్నారు. మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్లు, అత్యవసర సామగ్రి నిల్వ ఉంచారు. అవసరమైన వారికి తక్షణ చికిత్స అందేలా ప్రత్యేక జ్వరాల ఓపీ సేవలనూ విస్తరించారు.

పెరుగుతున్న పేషెంట్ల సంఖ్య

జిల్లావ్యాప్తంగా 18 పీహెచ్‌సీలు, 06 అర్బన్‌ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటితోపాటు మంథని, సుల్తానాబాద్‌లో సామాజిక, జిల్లా కేంద్ర ఆస్పత్రులు ఉన్నా యి. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో రోజూ 800 మంది – 1000 మందివరకు వివిధ వ్యాధులతోబాధపడేవారు వస్తున్నారని, జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతున్నవారు సుమారు 100–150 మందికిపైగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

స్వచ్ఛ శుక్రవారం, మంగళవారం..

వివిధ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో స్వచ్ఛ శుక్రవారం, మంగళవారం నిర్వహిస్తున్నారు. డ్రమ్ము లు, కుండలు, ట్యాంకర్లలో నీటినిల్వలను గుర్తించి పారబోస్తున్నారు. నీటినిల్వలతో బ్యాక్టీరియా వృద్ధిచెంది వ్యాధులు ప్రబలుతాయని సూచిస్తున్నారు. టైఫాయిడ్‌, మలేరియా, వాంతులు, విరోచనాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని, దోమతెరలు వాడాలని సూచిస్తున్నారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం, తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయడం, నిత్యం ఫాగింగ్‌ కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులు పంచాయతీ కార్యదర్శులకు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement