ఎల్‌నినోను ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొందాం

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

● ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి ● అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ● ఎల్‌నినోపై సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కందుల సాగును ప్రోత్సహించాలన్నారు. మధ్యమానేరులో 7.4 టీఎంసీల నీరు ఉందని, తాగునీటి సరఫరాకు అంతరాయం రానీయొద్దన్నారు. మరో విప్‌ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ కందులు, నువ్వు, జొన్న సాగుతో లాభాల బాట పట్టొచ్చన్నారు. ఆగస్టు వరకు సాగుకు అవకాశం ఉందని తెలిపారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యే కమలాకర్‌ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతీ ఎమ్మెల్యేకు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.కోటి చొప్పున కేటాయించాలని కోరారు. ఎల్‌నినోపై అధికారులు మూడు నెలల ముందే అవగాహన కల్పిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఖాజీపూర్‌ ఇసుక రీచ్‌ రద్దు చేయాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలన్నారు. ఎల్‌నినోపై అధికారులు సరిగా అవగాహన కల్పించడం లేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనడంతో పక్కనే ఉన్న మంత్రులు వారించా రు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాజకీయాలకు తావు లేకుండా రైతులకు భరోసా కల్పించాలన్నారు. తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎల్లంపల్లి నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేయాలని కోరారు. అమృత్‌ వాటర్‌ పైప్‌లైన్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. రామగుండంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని మేయర్‌ మహంకాళి స్వామి కోరారు.

కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ, విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ తెలిపారు. పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై ప్రతీ రైతుకు అవగాహన కల్పిస్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కంది, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని స్పెషల్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మహేశ్‌ దత్‌ ఎక్కా ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని రాష్ట్రవ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సురేంద్ర మోహన్‌ తెలిపారు.

అంతకుముందు పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సంపత్‌ ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం నమోదు, ఆరుతడి పంటల సాగు, వాటితో లాభాలు, రైతులకు అండగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, సీపీ గౌస్‌ ఆలం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఎస్పీలు అశోక్‌, మహేష్‌ బి గీతే తదితరులు పాల్గొన్నారు.

● ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి ● అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ● ఎల్‌నినోపై సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పాల్గొన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు

కరీంనగర్‌కార్పొరేషన్‌: ‘రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా అధిగమిద్దాం’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ లు, భూగర్భజలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ఆరుతడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఆశించినస్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్‌, భూగర్భ, విద్యుత్‌శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు.

రాజకీయాలకతీతంగా ముందుకు రావాలి

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ముందుకురావాలన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఎల్‌నినోను అఽధిగమిద్దామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement