జ్వరం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. తాగునీటిని మరిగించి తాగాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరునిల్వ లేకుండా చూడాలి. దోమలను నియంత్రించాలి. ఇలా సీజనల్ వ్యాధులపై ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం.
– పవిత్ర, జిల్లా వైద్యాధికారి
వేగంగా పారిశుధ్య పనులు
వర్షాకాలం ప్రారంభానికి ముందే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాం. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నాం. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. అప్రమత్తతతోనే వ్యాధులు దూరంగా ఉంటాయి. దీనికి ప్రజలు సహకరించాలి.
– నరేందర్, డీపీవో


