ఉద్యమ ప్రతిధ్వని నాగన్న | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ ప్రతిధ్వని నాగన్న

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

ఈకేవైసీ పూర్తిచేయాలి

జ్యోతినగర్‌: కార్మిక, కర్షక ఉద్యమ ప్రతిధ్వని నాగన్న జీవితం తెరిచిన పుస్తకమని సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడు జేవీ చలపతిరావు అన్నారు. ఎన్టీపీసీ ఆటోనగ ర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో అరుణో దయ నాగన్న సంతాపసభ ఆదివారం జరిగింది. ఆయన చిత్రపటానికి చలపతిరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలకుపైగా నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రజాగాయకుడిగా, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నాగన్న స్ఫూర్తిప్రదాత అన్నారు. అరుణోదయ, ప్రజా కళాకారులు నాగన్నను స్మరిస్తూ పాటలు పాడా రు. ఈదునూరి నరేశ్‌ అధ్యక్షతన జరిగిన సభ లో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు బతుకుల రాజన్న, నాయకులు ఐ.కృష్ణ, వెంకన్న, అశోక్‌, చిలుక శంకర్‌, ఈదునూరి రామకృష్ణ, గుండేటి మల్లేశం, రాజేశం, బుచ్చయ్య, పుట్టపాక స్వామి, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

గడువు పొడిగింపు

రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు కోసం ఈనెల 20 వ తేదీ వరకు దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు సీడీపీవో అలేఖ్య తెలిపారు. ఇప్పటి వరకు ఈ పోస్టు కోసం 376 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఉద్యోగాలకు విద్యార్థుల ఎంపిక

గోదావరిఖనిటౌన్‌: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఆదివారం ట్రెక్‌ వర్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్‌ సెలక్షన్స్‌ ఇంటర్వ్యూలో 9 మంది ఎంబీఏ విద్యార్థులు ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్‌ మనో హర్‌ తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీ, అలవెన్స్‌లు ఉంటాయన్నారు. త్వర లో మరిన్ని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

న్యాక్‌ సెంటర్‌ ప్రారంభించాలి

మంథని: పట్టణంలోని న్యాక్‌ సెంటర్‌ను ఎ ప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్‌ చేశారు. స్థానిక రాజగృహలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 – 2009 మధ్య మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈఏ డాది మార్చిలో తన నియోజవర్గంలో న్యాక్‌ సెంటర్‌ మంజూరు చేయించారని గుర్తుచేశా రు. ఆనాడు జీవన్‌రెడ్డి రూ.20కోట్లు తీసుకొస్తే, ఇప్పుడు రూ.40కోట్లు తీసుకురావావాలని, కా నీ రూ.20 కోట్లు తెచ్చి గొప్పలు చెప్పుకోవడం శోచనీయమన్నారు. పెద్దపల్లి – కాటారం రోడ్డు పూర్తిచేయడానికి రూ.ఐదు కోట్లు వెచ్చించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌ గౌడ్‌, నాయకులు మాచిడి రాజూగౌడ్‌, తరగం శంకర్‌లాల్‌, కనవేన శ్రీనివాస్‌, కొండ రవీందర్‌, పెగడ శ్రీనివాస్‌, జంజర్ల శేఖర్‌, ఏల్పుల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: జిల్లాలోని రేషన్‌ కార్డుదారులందరూ ఈనె ల 31లోగా ఈ కేవైసీ పూ ర్తి చేసుకోవాలని జిల్లా పౌ రసరఫరాల అధికారి శ్రీనా థ్‌ కోరారు. అంతరాయం లే కుండా రేషన్‌ బియ్యం పంపిణీకి ఇది తప్పని సరి అని పేర్కొన్నారు. జిల్లాలో లబ్ధిదారులు 7,16,498 మంది ఉండగా, ఇప్పటివరకు 5,89,738 మంది.. 82.31శాతమే ఈకేవైసీ పూర్తిచేశారన్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరు, ఇద్దరే పూర్తిచేశారని, ఎంతమంది ఉంటే అంతమంది ఈకేవైసీ పూర్తిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement