లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

గోదావరిఖనిటౌన్‌: లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని గోదావరిఖని అదనపు జి ల్లా న్యామూర్తి లావణ్య బాల్‌రెడ్డి అన్నారు. అ దనపు జిల్లా, రెండో అదనపు మున్షిఫ్‌ కోర్టుల్లో శనివారం లోక్‌ అదాలత్‌లు నిర్వహించారు. జ డ్జి మాట్లాడారు. రెండోఅదనపు న్యాయమూర్తి శ్రీనిజ కోహిర్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజీమార్గమే మేలు

పెద్దపల్లి: రాజీమార్గమే రాచ మార్గమని జూనియర్‌ సివిల్‌ జడ్జి గణేశ్‌ అన్నారు. స్థానిక ము న్సిఫ్‌ కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో జడ్జి మాట్లాడారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్‌,, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

పెద్దపల్లిరూరల్‌: ప్రతీపౌరుడు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని లీగల్‌ కౌన్సిల్‌ స భ్యుడు శ్రీనివాస్‌ బాను అన్నారు. స్థానిక ప్ర భుత్వ జూనియర్‌ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోక్సో చట్టం ప్రాముఖ్యత, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి వివరించారు. ఏదైనా సమస్యఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్‌ 15100కు కాల్‌చేసి తమ సమస్య వివరించాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ కేదారీశ్వర్‌, న్యాయవాది శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

పనితీరు మెరుగుపర్చుకోవాలి

గోదావరిఖని: కోర్టు డ్యూటీ పోలీసు అధికారు లు, సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకుని శిక్షల శాతం పెంచేలా చూడాలని రామగుండం పో లీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించా రు. కమిషనరేట్‌ పరిధిలోని కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ పోలీసు అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ప్రతీపనిని నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. విచారణ స మయంలో గందరగోళానికి గురికావొద్దన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని అన్నారు. పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బందిని శాలువాతో సత్కరించారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, సీసీఆర్‌బీ సీఐలు అనిల్‌కుమార్‌, బాబురావు, ఎస్‌ఐ వినీత తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్‌: వర్షాకాలంలో ప్ర జలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. శనివారం వివిధ డివిజన్‌లలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలాల్లో పూడికతీత కార్పొరేటర్‌ నె లకంటి రాముతో కలిసి పర్యవేక్షించారు. ట్రా న్స్‌జెండర్లకు కేటాయించిన ఇళ్లస్థలాలను పరిశీలించారు. పీజీ కాలేజీ ఆవరణలో లెక్చరర్లు, స్టూడెంట్స్‌తో కలిసి మొక్కలు నాటారు. మే యర్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీ సుకొని వరద ప్రభావం చూపే ప్రాంతాల్లో కాంక్రీట్‌తో కాలువల నిర్మాణం చేపట్టారన్నా రు. మేయర్‌ వెంట కార్పొరేటర్‌ దాసరి సాంబమూర్తి, డేవిడ్‌ రాజు, టీపీఎస్‌ నవీన్‌, ఏఈ తేజస్విని, నాయకులు మడిపెల్లి మల్లేశం, గడ్డం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

గోదావరిఖనిటౌన్‌: గురుపౌర్ణ మి సందర్భంగా ఈనెల 27న గోదావరిఖని డిపోనుంచి అ రుణాచలం బస్సు నడిపిస్తున్నామని డీఎం కవిత తెలిపారు. ఈనెల 27న మధ్యాహ్నం గోదావరిఖనిలో బయలు దేరి 28న ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి, గోల్డెన్‌ టెంపుల్‌(వెల్లూ రు) దర్శనం అనంతరం సాయంత్రానికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 29 గురుపౌర్ణ మి సందర్భంగా గిరిప్రదక్షణ, శ్రీఅరుణాచలే శ్వరస్వామి దర్శనం, మరుసటిరోజు ఉదయం జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత అదే రోజురాత్రి గోదావరిఖని చేరుకుంటుందని, వివరాలకు 70135 04982, 73828 47596 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement