జీజీహెచ్‌లో పేషెంట్ల కిటకిట | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో పేషెంట్ల కిటకిట

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

కోల్‌సిటీ: సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తుండటంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్ప త్రి (జీజీహెచ్‌)లో శనివారం పేషెంట్ల రద్దీ నెలకొంది. ఓపీకి ఒక్కరోజే 1,111 మంది చికిత్స కోసం రావడం గమనార్హం. జ్వరం, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు తదితర ఆరోగ్య సమస్యలతో పెద్దసంఖ్యలో ప్రజలు ఆస్పత్రిని ఆశ్రయించారు. జనరల్‌ మెడిసిన్‌లో 217 మంది, గైనకాలజీలో 202 మంది చికిత్స కోసం వచ్చారు. మిగతా విభాగాలకు కూడా గణనీయ సంఖ్యలో బాధితులు చేరడంతో ఆస్పత్రి ప్రాంగణం రద్దీగా మారింది. వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందించారు. సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించడంతోపాటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement