TS Election 2023: 'లక్ష' సాయానికి అర్హుల జాబితాలో.. కార్పొరేటర్‌ భర్త పేరు!

- - Sakshi

పెద్దపల్లి: ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంటతో అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా కుల, చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో శ్రీబీసీబంధుశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చే రూ.లక్ష సాయంతో ఆయా కులవృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది.

అయితే క్షేత్రస్థాయిలో తొలివిడత సాయం పంపిణీలో నేతల అనుచరుల కమీషన్లతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. కమీషన్‌ ఇవ్వనిదే చెక్కు ఇవ్వని పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొందని సాయం పొందినవారే ఆరోపిస్తున్నారు. మలివిడతలోనైనా కమీషన్లు, నేతల సిఫారసులు లేకుండా పూర్తి సాయం అందేలా చూడలని బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.10వేలు ఇవ్వాల్సిందే..
విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర 14 కులాలు, ఏంబీసీ కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు జూన్‌ 6నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారులకు తెల్లరేషన్‌కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది నిబంధన. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలకు లోబడి ఉన్న వారిని గుర్తించాలి.

ఇలా జిల్లాలో మొత్తం 10,759మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,765 మందిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 8,683 మందిని అర్హులుగా తేల్చారు. అందులో తొలివిడుతలో భాగంగా పెద్దపల్లి, రామగుండంలో 300 మందికి, మంథనిలో 180, ధర్మారంలో 65 మందిని తొలివిడత ఎంపిక చేశారు. అయితే తొలివిడతలోనే తమ అనుచరులకు చోటుకల్పించాలనే ఆలోచనతో నేతలు, వారి అనుచరుల సిఫారసుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

దీంతో ఇదే అదునుగా తమ బంధువులు, అనుచరులు, లేదా రూ.10నుంచి 15వేలు కమీషన్‌ ఇచ్చిన వారికే తొలివిడతలో చోటు కల్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా లేనివారి పేర్ల స్థానంలో ఆర్థికంగా బాగున్న వారి పేర్లతో జాబితా ఉండటంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి వివరణ కోరగా నిబంధనల మేరకే.. మంత్రి ఆమోదంతోనే ఎంపికచేశామని తెలిపారు. దళారులకు డబ్బులు ఇవ్వద్దొని, అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు.

అభివృద్ది నేను చూసుకుంటా..
జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ నిత్యం తిరిగే ఓ ఎంపీపీ భర్త ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తులకు అందించే రూ.లక్ష సాయం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు కమీషన్‌ తీసుకున్నట్లు సమాచారం. సాయానికి ఎంపికై న ఓ లబ్ధిదారుడు కమీషన్‌ ఇవ్వకపోవడంతో అతడి చెక్కు పంపిణీ కాకుండా అడ్డుకోవడంతో అతడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెక్కు ఇచ్చాడన్న ఆరోపణలు వస్తున్నాయి.

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో రూ.లక్ష సాయానికి అర్హుల జాబితాలో ఏకంగా కార్పొరేటర్‌ భర్త పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో రామగుండం పరిధిలో కొంతమంది కార్పొరేటర్లు వారి బంధువులకే దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈ లక్ష రూపాయల సాయంలోనూ బంధువులు, లేదా కమీషన్‌ ఇచ్చినవారికే ఇప్పిస్తామంటూ చెబుతున్నారు.

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం.. 
14-11-2023
Nov 14, 2023, 15:16 IST
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని..
14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,... 

Read also in:
Back to Top