పాలకొండ రూరల్: నమ్ముకున్నవారి కొంగు బంగారంగా పాలకొండ గ్రామ దేవత గారమ్మ విరాజిల్లుతున్నారు. ఇటీవల అమ్మవారికి ఆషా డం సారె సమర్పించిన భక్తులు గురువారం కాయగూరలు సమకూర్చటంతో గారమ్మ శాకంబరీగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలో పట్టణ పురవీధులకు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మసేవలో నిమగ్నమయ్యారు. స్థానికులు అందించిన కూరగాయలతో అర్చకులు అమ్మవారిని, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శాకంబరీ దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో స్థానికులు బారులు తీరారు.


