మద్యంతర ఉత్తర్వులు..! | - | Sakshi
Sakshi News home page

మద్యంతర ఉత్తర్వులు..!

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

మద్యంతర ఉత్తర్వులు..!

వీరఘట్టం: ఎవరేమనుకుంటే మనకేమి? మన పని జరిగిపోతే చాలని భావిస్తోంది టీడీపీ మద్యం సిండికేట్‌. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎకై ్సజ్‌శాఖ అడ్డుగోలుగా నిర్ణయం తీసుకోవడం వెనుక మద్యం సిండికేట్‌ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఒక బార్‌ను వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు అనుమతి ఇస్తూ ఎకై ్సజ్‌శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకై ్సజ్‌శాఖ వర్గాలే విస్తుపోయేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నోటిఫికేషన్‌ లైసెన్స్‌ పార్వతీపురంలో..

గతంలో బార్‌ల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఎకై ్సజ్‌ పాలసీని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మాత్రమే బార్‌లు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల మేరకు గతంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ విధానంలో బార్‌ల లైసెన్సులు కేటాయించారు. ఆ విధంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్‌లు ఏర్పాటయ్యాయి. అయితే ఇదిలా ఉండగా..ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

నిబంధనలను తోసిరాజని వీరఘట్టానికి బదిలీ

పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక బార్‌ను వీరఘట్టం పంచాయతీకి మార్చాలని టీడీపీ సిండికేట్‌ భావించింది. కానీ వీరఘట్టం పంచాయతీ పరిధిలో బార్‌ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. ఇదే విషయాన్ని ఎకై ్సజ్‌శాఖ స్పష్టం చేసింది. అయినా సరే టీడీపీ సిండికేట్‌ రాజధాని స్థాయిలో పావులు కదిపింది. పార్వతీపురంలో ఉన్న బార్‌ను నిబంధనలకు విరుద్ధంగా నైనా సరే వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ఏకంగా ఎకై ్సజ్‌శాఖ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేలా కథ నడిపించింది. టీడీపీ మద్యం సిండికేట్‌తో కుమ్మకై ్కన ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు జీఓ జారీ చేశారని ఎకై ్సజ్‌శాఖ వర్గాలే విమర్శిస్తున్నాయి. పంచాయతీల్లో అసాంఘిక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు బార్‌లు ఏర్పాటు చేయకూడదన్నది గతంలో తీసుకున్న నిబంధన. అయినా సరే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీటీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి ప్రభుత్వం తలుపులు తెరచింది.దీనిపై వీరఘట్టం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బార్‌ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇది ప్రభుత్వ నిర్ణయం

పార్వతీపురంలో ఉన్న సీఆర్‌బీ వైన్స్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ను వీరఘట్టంలో పెట్టుకునేందుకు బార్‌ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు మేరకు బార్‌ను వీరఘట్టం తరలించేందుకు అనుమతులు వచ్చాయి.ఇది ప్రభుత్వ నిర్ణయం. బార్‌ ఏర్పాటుకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. కె.సహదేవ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌,

పార్వతీపురం మన్యం జిల్లా

బార్‌ ఏర్పాటు చేస్తే గొడవలు పెరుగుతాయి

వీరఘట్టంలో ప్రస్తుతం ఉన్న మూడు మద్యం దుకాణాల వల్ల చీకటి పడితే రోడ్లపై నిత్యం ఏదో ఒక తగాదా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బార్‌ ఏర్పాటు చేస్తే మరిన్ని తగాదాలు ఏర్పడతాయి. బార్‌ ఏర్పాటును అడ్డుకుంటాం. వీరఘట్టం పట్టణ అభివృద్ధికి ఏదో ఒక మంచి పనిచేయండి తప్ప బార్లు ఏర్పాటు చేసి తగాదాలను పెంచవద్దు.

జె.అమర్‌నాథ్‌, వీరఘట్టం

పంచాయతీ పరిధిలోకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్‌ తరలింపు

ఉత్తర్వులు జారీ చేసిన ఎకై ్సజ్‌ శాఖ అధికారులు

బార్‌ ఏర్పాటును అడ్డుకుంటామంటున్న వీరఘట్టం ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement